Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 10.05.2021

దిన ధ్యానము(Telugu) 10.05.2021

మీరు సిద్ధమేనా?

"తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు". - హెబ్రీయులకు 2:18

ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకమునుపు నా హృదయములో కాస్త భయము, దిగులు ఉండేది. అలా భయం వచ్చినప్పుడల్లా నా హృదయంలో ఏదో తెలియని ఆలోచనతో అల్లాడిపోయేవాడ్ని. ఆ దినము రాత్రి నేను పడుకోలేను. ఇలా నిద్ర లేని రాత్రులు నా జీవితంలో అనేకం. అ సమయంలో నా గదిలో  లైట్ వేయించి నా తండ్రిని పిలిచి అతని పక్కనే నేను పడుకొనేవాడ్ని. ఇలాగు అనేక దినములు ఏదో తెలియని భయముతో జీవిస్తూ వచ్చాను. 

ఇలాంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు ప్రభువును అంగీకరించి నా స్నేహితులతో కలిసి ప్రభువును ఆరాధించుటకు నేను వాడుకగా పెట్టుకొని ఉన్నాను. అలా ఆరాధిస్తున్నప్పుడు ఒక దినము పరిశుద్ధాత్మతో మేము నింపబడ్డాము. ఆ దినము మొదలుకొని నాలో ఉండిన భయములు, దిగులులు నన్ను విడిచి వెళ్లిపోయాయి. ఇలాగు ప్రభువు నా జీవితంలో అద్భుతం చేసి సహాయం చేసారు. అనేకులకు ప్రభువు ప్రేమను ప్రకటించే కుమారుడిగా దేవుని పరిచర్య చేస్తున్నాను. బైబిల్లో కూడా సముద్రము మీద నడచి వచ్చిన యేసయ్యను చూచి భూతము అని భయపడిపోయారు. యేసుక్రీస్తు నావలో ఎక్కిన వెంటనే గాలి, తుఫాను ఆగిపోయి సముద్రము నిమ్మలమాయెను అని చదువుతున్నాం. 

ప్రియ స్నేహితులారా! మీరు కూడా ఏదో ఒక కారణముతో బయపడుతున్నారా? నా యొక్క జీవితంలో పని చేసిన ప్రభువు మీ యొక్క జీవితంలో కూడా సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. మీ యొక్క భయమును పోగొట్టుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క జీవితము అనే నావలో ఆయనకు చోటు ఇవ్వండి. ఆయన బలాన్ని విశ్వసించండి అప్పుడు మీ జీవితంలో అద్భుతం చూస్తారు. దీనిని చదువుతున్న అందరం ఇలాంటి పరిస్థితులగుండా వెళ్తున్నారు అని చెప్పలేను కానీ ఈ లోకంలో జీవిస్తున్న అనేకులు ఏదో ఒక భయముతో జీవిస్తున్నారు. వాళ్లకు సమాధానకరమైన మాటలు చెప్పి వాళ్ళను ధైర్య పరుచుటకు యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇలాంటి ప్రజలకు సువార్త ప్రకటించి విమోచన మార్గములో నడిపించుటకు మీరు సిద్ధమేనా? 
-    బ్రదర్. వై. అనిష్ రాజా

ప్రార్థన అంశం:-
గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న మన మిషనరీ దంపతులకు దేవుడు గర్భఫలము దయచేయులాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)