దిన ధ్యానము(Telugu) 08.05.2021
దిన ధ్యానము(Telugu) 08.05.2021
మనము అంగీకరించబడుదమా?
"తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను" - అపో.కార్యములు 13:22
బైబిల్లో ప్రభువు సౌలు రాజును రాజుగా తీసేసి దావీదును రాజుగా చేసిన దానిని మనము గ్రహించగలము. దీనికి అనేక కారణములు ఉన్నప్పటికీ ఈ రోజు రెండు కారణములు ద్యానిద్దాం. దేవుని హృదయనుసారుడైన దావీదు యొద్ద త్యాగమును, ఇతరులను ఘనపరిచే మనస్సు ఉండేది. ఒక మారు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఫిలిష్తీయుల సైన్యం బెత్లహేములో ఉండినప్పుడు దావీదు బెత్లహేము యొక్క గుమ్మము యొద్ద ఉంటున్న బావిలో ఉన్న నీటిని చూడగానే అతనికి దాహం వేసింది. వెంటనే దావీదుతో ఉంటున్న ముగ్గురు బలాఢ్యులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఫిలిష్తీయుల యొక్క సైన్యంలోనికి వెళ్లి ఆ నీటిని తోడుకొని వస్తున్నారు. దావీదు అయితే వాళ్ళ త్యాగాన్ని గుర్తించుకొని తాను ఆ నీటిని త్రాగకుండా దేవుని కొరకు వాటిని త్రోసివేశారు. కాని సౌలు అయితే గోలియాతును పడగొట్టుటకు దావీదు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్లిన దానిని తగిన విధానంలో ఘనపరచలేదు మారుగా దావీదు యొక్క ప్రాణాన్ని తీయుటకు చూసాడు.
సౌలు కి దావీదునకు మద్యలో గల మరొక గుణాతిశయము దేవుని వలన అభిషేకించబడిన వాళ్ళతో వారు ఎలాగు ప్రవర్తించారు అన్నదే. సౌలును దావీదు చేతికి దేవుడు అప్పగించినప్పటికి దావీదు అయితే సౌలు పైన చేయి వేయుటకు దావీదు తెగించలేదు. కాని సౌలు అయితే దేవుని యాజకుడైన అహిమలేకు బ్రతిమలాడినను ఆయనను ఆయనతో ఉండిన 85 మందిన తన ఖడ్గముతో నరికి చంపివేశారు. చూడండి వీరిద్దరి యొక్క మనస్తత్వం. అవును సౌలు రాజ్యాగం నుండి త్రోసివేయ వేయబడ్డారు దావీదు అయితే రాజ ఘనతను పొందుకున్నారు.
దేవుని పిల్లలారా! మన జీవితం దేవుని చేత అంగీకరించబడుట లేక తిరస్కరించబడుట అనేది మనము దేవునికి లోబడి నడుచుకున్న విధానముబట్టే ఉంటుంది. మనము ఇతరుల యొక్క సమర్పణను, త్యాగాన్ని గుర్తించి ఘనపరుస్తున్నామా లేక మనము చేస్తున్నదే మనకు గొప్పగా అనిపిస్తుందా? దేవుని యొక్క అభిషేకమును, అభిషేకించబడిన వాళ్ళను ఆశ్రద్దగా తలంచి మాట్లాడుతున్నామా ఆలోచించి చూద్దాం. సౌలు వలె తెగించి మనస్సు కాఠిన్యత గల వారిగా ఉండ కూడదు. కాని దావీదు వలె జీవించి ఖచ్చితమైన దేవుని కృపను పొందుకుందాం.
- బ్రదర్. కె. బెంజమిన్ బ్రెట్.
ప్రార్థన అంశం:-
మన మిషనరీల యొక్క భార్యలు నిరోస, సుసన్న, రాజకుమారి అనే వాళ్లకు దేవుడు తగిన సమయంలో సుఖ ప్రసవమును దయచేయు లాగున ప్రార్దిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250