దిన ధ్యానము(Telugu) 07.05.2021
దిన ధ్యానము(Telugu) 07.05.2021
ని స్వరము వినే గొర్రె.
"యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను" - మార్కు 1:17
2001వ సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తారీఖు తీవ్రవాదుల వలన హైజాక్ చేయబడిన విమానం అమెరికాలో గల పెంటగన్ కట్టడం మీద పడినప్పుడు దాంట్లో అనేక మంది ఉన్నారు. వారు ఆ విమానం గుద్దినప్పుడు వచ్చిన పొగ వలన వారు బయటకు రాలేక మిక్కిలి ఇబ్బంది పడ్డారు. దాంట్లో అనేక మంది ఊపిరి తీసుకొనుటకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఐసాక్ హబ్బి అనే పోలీస్ ఆఫీసర్ లోపలకి వెళ్ళి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని వెతకడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన ఆయన గట్టి శబ్దంతో నా స్వరము విని నన్ను వెంబడించండి అని బిగ్గరగా చెప్తూ బయటకు వచ్చారు. ఆయన యొక్క మాట విని అనేకులు బయటకు వచ్చి ప్రాణాలతో బయట పడ్డారు.
చేపలు పడుతున్న పేతురును ఆయన సహోదరుడైన అంద్రెయ సముద్రములో వల వేస్తున్నప్పుడు యేసు వాళ్ళను చూచి నన్ను వెంబడించండి అని పిలిచారు. యేసుక్రీస్తు వాళ్ళను పిలిచిన వెంటనే తోమా యొక్క వలలను, నావను విడిచి ఆయన మాటకు లోబడి ఆయనను వెంబడించారు. యేసయ్య వాళ్ళను తనతో ఉంచి వాళ్లకు అనేక కార్యములు నేర్పించి తర్ఫీదు ఇచ్చి గొప్ప బలము కలిగిన సేవకులుగా మార్చి వాళ్ళను పరిచర్యలో వాడుకున్న దానిని మనము బైబిల్ చదువుతున్నాం.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఈ లోకములో అనేకులు పాపములతోను, శాపములతోను బయటకు రాలేని పరిస్థితుల్లో కోట్ల కొలది ప్రజలు విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ యేసుక్రీస్తు నన్ను వెంబడించండి అని అనుక్షణము పిలుస్తున్నారు. నిలకడలేని ఆశాస్వతమైన ఈ లోకంలో దిక్కుతోచక, జీవించడానికి మార్గం లేక సినిమా హీరోలను, రాజకీయ నాయకులను వెంబడించి మోసపోయి వాళ్ళను చూచి నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు చెబుతున్నారు. కాపరి మాట విని వెంబడించే గొర్రె వలె ఆయన స్వరము విని వెంబడించే వారు సంరక్షించబడి భాగ్యవంతులుగా ఉంటారు. ఆయన స్వరాన్ని వినే గొర్రెలుగా ఈ దినమే ఆయనను వెంబడిద్దాం మరియు అనేకులు ఆయనను వెంబడించే వారిగా మారుద్దాం.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్.
ప్రార్థన అంశం:-
ప్రతి ఆదివారం ప్రచారం అవుతున్న యవ్వనస్తులు కూడికను అనేకులు చూచి ఉజ్జీవం పొందేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250