దిన ధ్యానము(Telugu) 21.12.2024
దిన ధ్యానము(Telugu) 21.12.2024
అంశం: విశ్వాసం
"పిల్లవాడిని తగిన మార్గమున శిక్షింపుము, అతడు వృద్ధుడైనను ఆ మార్గము విడువడు" – సామెతలు 22:6
మేరీ టీచర్ తన తరగతిలో ప్రతి విద్యార్థిని పిలిచ వాళ్లకు తెలిసిన పాటలన్నా, కథలనన్నా చెప్పమని అడిగింది. ప్రిన్స్ పరుగెత్తుకుంటూ వచ్చి, "నన్ను మరచిపోకుము యేసయ్యా, నీ కృప నా మార్గాన్ని మారుస్తుంది" అనే పాటను అద్భుతంగా పాడాడు. మేరీ టీచర్ ఆశ్చర్యపోయింది. ఈ పాటను ఎవరు నేర్పారని అడగగా, ప్రిన్స్ ఆనందంతో, "నా అమ్మమ్మ" అని చెప్పాడు. తన అమ్మమ్మ ప్రతిరోజూ బైబిల్ కథల్ని, పాటల్ని తనకు నేర్పుతుందని చెప్పాడు. ఆమె శ్రమ వల్లే ఆ పాట ప్రిన్స్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది.
చిన్న వయసులోనే ప్రిన్స్ యేసునందు ఆనందిస్తూ పాటలు పాడటం, ఎంత ఆశ్చర్యకరం! నాయనా, నేనొకడిని ప్రభువును తెలుసుకోవడమే సరిపోదు; మన సంతతికి కూడా మన మార్గాన్ని చూపించాల్సిన గొప్ప బాధ్యత మన మీద ఉంది. ద్వితీయోపదేశకాండము 6:6,7 లో, "ఈ దినమున నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయములో ఉండవలెను. 7 ఆ మాటలను నీ పిల్లలకు బోధించవలెను. నీ యింట కూర్చునప్పుడు, మార్గమున నడచునప్పుడు, పడుకొనునప్పుడు, లేచునప్పుడు వాటి గురించి మాట్లాడవలెను" అని చదువుతాము.
మన యింటి చిన్నవారిని ప్రభువుకు ఇష్టమైన వారిగా పెంచడంలో మనది ఒక గొప్ప పాత్ర. మీరు బైబిల్ శాస్త్రాలను బోధించే ప్రేమగల అమ్మమ్మా? అయితే ప్రభువు మీపై సంతోషించవచ్చు. 2 తిమోతికి 1:5 లో, యువకుడైన తిమోతిని విశ్వాసంలో స్థిరంగా నిలిపిన కారణం అతని అమ్మమ్మ లోయిస్, తల్లి యూనికె అని చదువుతాము. అందువల్ల, పెద్దవారు చిన్నవారిని బైబిల్ చదవడం, ప్రభువును స్తుతించడం, నిరంతర ప్రార్థన చేయడం వంటి విషయాలను బోధించాలి. అంతేకాక, వారి కోసం సజీవ దృశ్యంగా ఉండాలి.
మీ యింట చిన్నవారి కొరకు మీరు ప్రతిరోజూ ప్రార్థిస్తున్నారా? వారిని ప్రభువులో నిలపడం కోసం మీరు శిక్షిస్తున్నారా? వారికి మేలు చూపించే ఉదాహరణగా మీరు తయారవుతున్నారా? సందేహించవద్దు; మీ ఇంటిలోనూ తిమోతిలు ఎదుగుతారు. ప్రభువు మిమ్మును స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.
- శ్రీమతి. ఎమిమా సౌందరరాజన్ గారు
ప్రార్థనా అంశం:
మన క్యాంపస్‌లో జరగబోయే క్రిస్మస్ సువార్త సభకు చాలామంది హాజరై రక్షణ పొందాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250