దిన ధ్యానము(Telugu) 06.05.2021
దిన ధ్యానము(Telugu) 06.05.2021
క్షమాపణ యొక్క ఘనత.
"...క్రీస్తు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి" - కొలస్సీయులకు 3:13
దక్షిణాఫ్రికా పూర్వపు రాష్ట్రపతి అయిన నెల్సన్ మండేలా, తాను అనేక దినముల పోరాటం తరువాత ఆ దేశమునకు రాష్ట్రపతి అయ్యారు. ఒక దినము ఆయన తన కాపలా వాళ్ళతో కలిసి నగరంలో ఉన్న ఒక హోటల్ కి బోజనమునకు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వాళ్లకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా ఉన్న ఒక అతను తన ఆహారం కొరకు ఎదురుచూస్తున్నారు. అప్పడు నెల్సన్ తన సైనికులను పంపి అతనిని వచ్చి తమతో కలసి ఆహారమును భుజించమని చెప్పారు. ఆయన తన ఆహారమును తీసుకువచ్చి నెల్సన్ తో పాటు కూర్చొని భోజనం చేశారు. ఒక సైనికుడు రాష్ట్రపతి దగ్గరకు వచ్చి ఆ మనుష్యుడు మిక్కిలి అనారోగ్యంతో కనిపిస్తున్నారు ఆయన ఆహారం భుజించినప్పుడు ఆయన రెండు చేతులు కూడా వనికిపోతున్నాయి అని అన్నారు.
అందుకు నెల్సన్ సైనికుడా అది అనారోగ్యంతో వచ్చిన వణుకు కాదు నిజము ఏమిటో తెలుసా? నేను మునుపు జైల్లో ఉండినప్పుడు ఈయన నాకు జైలర్ గా ఉండేవాడు. ఈయన తరుచుగా నన్ను హింసించేవాడు. ఆయన హింసించినప్పుడు నేను చాలా బాధ అనుభవించి చివరిలో దాహానికి నీళ్లు ఇమ్మని అడిగే వాడిని, ఈయన వచ్చి నా పైన మూత్ర విసర్జన చేసేవాడు. నేను ఇప్పుడు దక్షిణ ఆఫ్రికా రాష్ట్రపతిగా ఉన్నాను కాబట్టి నేను కూడా ఆయన వలె హింసిస్తాను అని వణుకుతూ ఉన్నాడు. కాని అది నా అలవాటు కాదు. కీడుకు ప్రతి కీడు చేసే మనిషి యొక్క పరిస్థితి ఎన్నడూ ఒక దేశాన్ని, ఒక వ్యక్తిని పైకి తీసుకు రాకుండా నాశనం చేసేస్తుంది. అదే సమయంలో అనేక విషయాల్లో మనస్సు యొక్క ఓర్పు గొప్ప సామ్రాజ్యాన్ని తయారుచేస్తుంది అన్నారు మండేలా.
అవును ప్రియమైన వారలారా! మనకు అన్నింటిలో మాదిరిగా ఉంటున్నది యేసుక్రీస్తే. ఆయన తండ్రి విరేమి చేయుచున్నారో విరేరుగరు వీళ్ళను క్షమించండి అని సిలువలో తనను కొట్టిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారు. మనము కూడా అనేక సమయాల్లో ఇతరుల వలన ఏర్పడిన గాయములు, వేదనలు గురించే ఎక్కువుగా మాట్లాడుతూ చింతిస్తున్నాము. న్యాయం లేకుండా నేను శిక్షించ బడుతున్నాను అని సణుగుకుంటు ఇతరుల మీద చేదు అభిప్రాయాలతో మనం జీవిస్తున్నాం. ఇతరులను మనము క్షమించిన యెడల మన తప్పిదములు కూడా క్షమించబడును అని బైబిల్ చెబుతుంది. క్షమించక పోవడం అన్నది మనకు మనమే గోతులు తవ్వుకోవడం. అందువలన వస్తున్న చేదు, కోపము, ఆత్మ హీనత ఇవన్నీ వేదన పరచడమే కాకుండా ఇతరులను కూడా వేదన పరుస్తుంది. అది మాత్రమే కాకుండా అనేకమైన రోగములకు ప్రాముఖ్యమైన కారణము. కాబట్టి మనము ఈ భూలోకంలో సుఖముగా జీవించుటకు క్రీస్తు మనలను క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించాలి. కారణమును బట్టి క్షమించ కుండా ఉండటం కాదు. ఈ భూలోకంలో మనము చింత లేకుండా సుఖముగా జీవించాలి అంటే క్రీస్తు పొలికను వ్యక్త పరుస్తూ ప్రేమ అనే అగ్ని మనలో మండుతూ ఉండాలి.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్.
ప్రార్థన అంశం:-
ప్రతి శనివారంలో వస్తున్న చిల్డ్రన్ స్పెషల్ ప్రోగ్రామ్ ను యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో వీక్షిస్తున్న అనేక మంది చిన్నారులు రక్షించబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250