దిన ధ్యానము(Telugu) 11.12.2024
దిన ధ్యానము(Telugu) 11.12.2024
అంశం: ఆశీర్వాదమును తెలుసుకోండి
"సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమైయున్నాము" - గలతియులకు 4:28
ఒకసారి ఓ వ్యక్తి ఓ నౌకలో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం చేస్తూ చాలా అలసిపోయాడు. ఇది గమనించిన నౌక కెప్టెన్ అతనితో మాట్లాడుతూ, "సర్, రెండు రోజులుగా నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ప్రతిరోజూ అలసిపోయి కనిపిస్తున్నారే! మీకు సమస్య ఏమిటి?" అని అడిగాడు.
ఆ ప్రయాణికుడు బదులిచ్చాడు, "సర్, నేను నగరంలో నుండి తెచ్చిన అన్నం అంతా అయిపోయింది. కొన్ని పొడి ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా అయిపోయిన తర్వాత ఏమి చేయాలో తెలియదు. ఇంకా చాలా రోజులు ప్రయాణం చేయాలి!" అని విచారంగా చెప్పాడు.
దాన్ని విని కెప్టెన్ అతని టికెట్ తీసుకొని చూసి, "సర్, ఈ టికెట్ ఉన్నవారికి నౌకలో ఆహారం సరఫరా చేయబడుతుంది. మీరు చూడండి, దీనిపై ఏమి రాసి ఉందో!" అని చూపించాడు. ఆ ప్రయాణికుడు ఆశ్చర్యంగా చూస్తూ, తన అజ్ఞానంపై విచారించాడు.
ఎఫెసీయులు 1:3 ప్రకారం, క్రీస్తు యేసులో, పరలోక స్థలములలో ఉన్న ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో తండ్రియైన దేవుడు మనలను ఆశీర్వదించాడు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానంలో, "భూమి మీదనున్న ప్రతి కుటుంబమును నీలో ఆశీర్వదించబడును" అని చెప్పారు. యేసుక్రీస్తు సిలువలో మనకొరకు అన్నింటినీ పూర్తి చేసారని మనకు తెలుసు.
ప్రియమైన వారలారా! యేసు క్రీస్తు సిలువపై మనకొరకు సంపాదించిన ఆశీర్వాదాలను తెలుసుకుందాం. అవి తెలుసుకోలేనిదే, మన ప్రభువుకున్న ఆత్మీయ ఆశీర్వాదాలను పొందలేం. సాతాను బంధకాలలో చిక్కుకోని, అతని బానిసలుగా జీవించవలసి వస్తుంది. ఈ రోజు మనం నిర్ణయం తీసుకుందాం. ప్రభువు మనకొరకు ఉంచిన ఆశీర్వాదాలను పొందడానికి, ఆనందంగా జీవించడానికి మనలను అర్పిద్దాం. ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక!
- బ్రదర్. శివ పళనిస్వామి గారు
ప్రార్థన అంశం:
ఈ సంవత్సరం థీమ్ ప్రకారం మీరు అనేక గ్రామాలు, రాష్ట్రాలు మరియు దేశాలకు వెళ్లడానికి దేవుడు మీకు సహాయం చేయమని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250