Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 05.05.2021

దిన ధ్యానము(Telugu) 05.05.2021

ప్రభువా నన్ను ఓదార్చండి.

"...నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను" - 2కోరింథీయులకు 12: 10

మిషనరీ దంపతులైన రే మరియు సోఫియా సౌత్ ఆఫ్రికాలో 40 సంవత్సరాలు పైగా దేవుని పరిచర్యను చేస్తూ వచ్చారు. కఠినమైన పరిస్థితుల్లో కూడా మిక్కిలి తెగింపుతో పరిచర్య చేస్తువచ్చారు. వీరు చేసిన పరిచర్యను ఎవ్వరు చూసిన దేవుని మహిమ పరచకుండా ఉండలేరు. అంతగా దేవుని పనిని చక్కగా చేసారు. ఈ పరిస్థితుల్లో సోఫియా అనారోగ్యం పాలై మంచాన పడ్డారు. తన యొక్క బట్టలు యొక్క బటన్ పెట్టుకోవడానికి, ఒక చిన్న కప్పుతో నీళ్లు తీసుకోవడానికి బలము లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఈలాగు మోసకరమైన, కష్టకరమైన పరిస్థితుల్లో కూడా తన హృదయంలో బాద గాని లేక తనంతట తానే ఆత్మ హీనతకు గురి కాలేదు. తన యొక్క బలహీనత సమయంలో తనలో తాను చెప్పుకున్న మాటలు ఇవే సోఫియా నీవు దీనికొరకే పిలవబడియున్నావు. దీని కొరకే నీవు యేసయ్యను అంగీకరించి యున్నావు. పరిగెడుతూ పరిచర్య చేయుటకు కాదు. దీని కొరకు దేవుడు నన్ను పిలిచియున్నారు అన్నదే ఆమె యొక్క ఆలోచన. 

ఈ దినము బైబిల్లో పౌలు యొక్క జీవితాన్ని గమనించండి ఆయన దేవుని నామము మహిమపరచ బడే విధముగా చక్కగా పరిచర్య చేసిన వ్యక్తి. పరిచర్య మద్యలో తనను విడనటువంటి బలహీనతలు, ముళ్ళు ఉండడం ఆయన చూసారు. అయినను ఆయన ఎంత మాత్రము చింతించ లేదు మారుగా దానిని అర్ధం చేసుకున్న వారిగా దేవున్ని మహిమపరుస్తున్నారు. అందులో నేను ప్రియముగా వున్నాను అని పౌలు సంతోషిస్తున్నారు. క్రీస్తులో లేని ఒక మనిషి అతని సందేశమును చదివిన యెడల ఇది చాలా కఠినము అని చెప్తాడు. తనను ప్రేమించే తన పిల్లలకు దేవుడు ఇలాంటి మార్గములను అనుమతిస్తున్నారు అంటే మీరు దీనిని విస్వసించ గలుగుతున్నారా?

ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలి అనుకుంటున్నారు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. (2కోరింథీయులకు 4: 17)  దీనిని చదువుతున్న మీ కొరకు గొప్ప సందేశం సిద్ధపరచి ఉంది. దేవుని మేలులను అనుభవించుటకు ఇప్పటి నుండే బలహీనతలు మధ్యలో కూడా దేవున్ని మహిమ పరచండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. సమస్తము మేలు కొరకే నడిపిస్తున్న దేవుడు ఈ దినములో కూడా మీకు ఒక అద్బుతమును చేస్తారు. విస్వసించండి.
-    బ్రదర్. పి. జాకబ్ శంకర్

ప్రార్థన అంశం:-
సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అనేక కార్యక్రమాలను అనేకులు వీక్షించి అనేకులు మేలు పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)