దిన ధ్యానము(Telugu) 04.05.2021
దిన ధ్యానము(Telugu) 04.05.2021
మాస్క్ తప్పని సరి.
"దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి" - ఎఫెసీయులకు 6: 11
ఈ ప్రపంచము కరోనాతో పోరాడుతుంది మాస్క్ ధరిచుకొనుట చాలా ప్రాముఖ్యము అని వినబడని స్థలము లేదు. లోక చరిత్రను తిప్పేసిన ఈ కరోనా ప్రస్తుతం లోకాన్ని అల్లకల్లోలం చేస్తుంది. వైద్యులు, ప్రభుత్వం మరలా మరలా చెబుతున్న ఒక కార్యం మాస్క్ ధరించండి అనేదే. అది మనకు సంరక్షణను ఇస్తుంది, మనతో పాటు ఉన్న వాళ్లకు సంరక్షణ ఇస్తుంది. ప్రతి దినము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించు కొనుట చాలా ప్రాముఖ్యం. కరోనాతో పోరాడాలి అంటే దీనిని కచ్చితంగా చేయాలి.
పరిశుద్ధ బైబిల్లో మానవ జాతి అంతటికీ ఒక పోరాటం ఉన్నది. అది ఆకాశ మండలంలో గల దురాత్మ సమూహములతో పోరాటం. ఇది ప్రతి క్రైస్తవుడు పోరాడవలసిన పోరాటం. సాతాను యొక్క తంత్రములను మనము ఎదిరించి నిలబడి పోరాడవలసిన సమయం ఇది. ఈ ఆత్మీయ పోరాటంలో మనలను మనము కాపాడుకోవాలి, అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళను కాపాడాలి. అందుకు మనము సత్యము అనే దట్టిని కట్టుకొని, సిద్ధమనస్సు అనే పాద రక్షకులు ధరించుకొని, విశ్వాసమనే డాలు పట్టుకొని, రక్షణ అనే శిరస్త్రణము ధరించు కొని, దేవుని వాక్యము అనే ఆత్మీయ ఖడ్గము పట్టుకొని దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మెలుకువ కలిగి ప్రార్ధించాలి అప్పుడు మనం సంరక్షించబడతాం.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! కరోనా కు వ్యతిరేఖంగా పోరాడుతున్న దానికంటే మనలో ఉన్న ఈ పోరాటం చాలా ప్రాముఖ్యం. దీనిలో ఓడిపోయిన యెడల జీవితంలో సమాధానము, నెమ్మది అనే దానిని కొల్పోతాం. మాస్క్ ధరించుట ఎంత ప్రాముఖ్యమో దాని కంటే ప్రాముఖ్యం పైన చెప్పబడిన కార్యములను మనము అను దినము ధరించుకోవాలి. మన శరీరానుసారమైన మనుష్యున్ని కాపాడుకొనుటకు మనం మాస్క్ ధరిస్తున్నాం. కాని మన ఆత్మీయ మనుష్యుడ్ని కాపాడుకొనుటకు సర్వాంగ కవచము ధరించుకొని సాతాను యొక్క తంత్రములను వాటి యొక్క దురాత్మ సమూహముల పైన ప్రార్ధనలో ఎదురించి పోరాడి విజయం పొందుకుందాం.
- బ్రదర్. టి. శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
మన మిషనరీల యొక్క పిల్లల చదువుకు సరిపడే ధన సహాయం కొరకు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250