Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 21.11.2024 (Gospel Special)

దిన ధ్యానము(Telugu) 21.11.2024 (Gospel Special)

 

అంశం: ఆలస్యము

 

"అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!” - 2 కోరింథీయులకు 6:2

 

నేటి కాలంలో సువార్తకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ చివరి సమయములో కష్టపడి పనిచేస్తే, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ, క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి తలుపులు మూసుకుపోయాయని అంటున్నారు. కనాను దేశాన్ని గూఢచారులు చూచి వచ్చినప్పుడు వారు చెప్పినట్లు నేడు చాలా మంది కూడా చెబుతున్నారు. కాని యెహోషువ, కాలేబు వంటి కొద్దిమంది సేవకులు మాత్రమే విశ్వాసముతో భారతదేశపు విస్తార భూమిలో సేవ చేస్తున్నారు.

 

నేటి కాలంలో సువార్తను విన్న తర్వాత అది నిజమని అనిపించుకునే పరిస్థితి ప్రజలలో కనిపిస్తోంది. కొంతకాలం గడిచాక, రహస్య క్రైస్తవులుగా ఉండాలని నిర్ణయించుకుంటారు. నామమాత్రంగా బాప్తిస్మము పొందడాన్ని ఆలస్యం చేస్తారు. సంఘ సేవలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల, చాలా మంది రక్షణ పొందకుండానే వెనుదిరుగుతున్నారు. 

 

ఒక మహిళ, ఒక లగ్జరీ హోటలులో నృత్యం చేస్తూ, తన జీవితంలో శాంతి లేకుండా ఉండేది. క్రైస్తవ సమావేశానికి హాజరైంది. అక్కడ ఆమె సంపూర్ణ శాంతిని పొందింది. కానీ నృత్యం అందించే సౌకర్యాన్ని కోల్పోవడం ఆమెకు ఇష్టం లేదు. కాబట్టి తన డైరీలో, కొంత డబ్బు సంపాదించి, ఆనందంగా ఉండి తర్వాత యేసును సేవిస్తానని రాసింది. చాలా కాలం తరువాత, ఆమె తన డైరీని గుర్తుకు తెచ్చుకుంది. కానీ ప్రపంచ ఆశక్తి ఆమెను వదలలేదు. కాలం గడిచే కొద్దీ, ఆమె తన మనస్సులో వచ్చిన సంఘర్షణను సంతృప్తి చేసుకునేందుకు ప్రతి రోజూ "రేపు నేను పూర్తిగా యేసుకు ఆత్మార్పణ చేస్తాను" అని రాసేది. అనుకోకుండా ఒక రోజు, ఆమె కారుప్రమాదంలో మరణించింది. ఆమె డైరీలో రాసినదాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇది అమెరికాలో క్రైస్తవులలో పునరుద్ధరణకు కారణమైంది.

 

నేటి క్రైస్తవులు, వారు శిష్యులని గ్రహించక, క్రీస్తు పనిని చేయకుండా, సమయాన్ని వృథా చేస్తున్నారు. "శిష్యులు క్రైస్తవులు" (అపోస్తుల కార్యం 11:26) అనే పాఠాన్ని గుర్తుంచుకుందాం. సువార్తను ప్రకటించడం వారి విధి. అపొస్తలుడైన పౌలు, "సువార్తను ప్రకటించకుంటే నాకు శాపము." (1 కొరింథీయులకు 9:16) అని చెబుతున్నాడు. నేడు, మనకు చేసిన మంచికి కృతజ్ఞతగా క్రీస్తును సేవించడం మన బాధ్యత కాదా? ఆలస్యం చేయకుండా సేవచేద్దాం. దేశం దేవుని తెలుసుకునేలా చేద్దాం.

- శ్రీమతి. ఫాతిమా సెల్వరాజ్ గారు.

 

ప్రార్థన అంశం:

ప్రతి తాలూకాలో పిల్లల క్లబ్ ప్రారంభించబడేలా ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)