దిన ధ్యానము(Telugu) 03.05.2021
దిన ధ్యానము(Telugu) 03.05.2021
తండ్రి ప్రేమ.
"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.... తన అద్వితీయకుమారున్ని... అనుగ్రహించెను" - యోహాను 3:16
అమెరికాలో గల మెక్సిగన్ లో రిగ్వాన్ బిక్ - మేరీ దంపతులకు మాడిసన్ అనే కుమార్తె జన్మిచింది. ఆమెకు మెదడు, నరాలు ఎదుగుదల లేకపోవడం వలన ఆమె మంచం మీద ఉండ వలసిన పరిస్థితి. పొగ, మత్తు ముందుకు అలవాటు పడిన రిగ్ తన కుమార్తె కొరకు ఎక్కువ రోజులు జీవించాలి అని చెడు అలవాట్లు అన్నింటిని విడిచి పెట్టి పరుగు పందెంలో పాల్గొనుటకు ట్రైనింగ్ తీసుకున్నారు. అందుకు తన యొక్క హ్యాండి క్యాప్ కుమార్తెను తోడుగా పెట్టుకున్నారు. మంచంలో ఉన్న ఆమె ఎలాగు పరిగెత్తగలదు కాబట్టి ఆమె కొరకు మూడు చక్రాల కుర్చీ, ఒక పడవ తయారు చేశారు. పరిగెత్తి నప్పుడు మూడు చక్రాల కుర్చీలో ఆమెను పడుకోబెట్టి తోసుకుంటూ వెళ్తారు. అలాగే ఈత కొట్టేటప్పుడు ఆ పడవలో ఆమెను పడుకోబెట్టి ఆ పడవ తాడును తన భుజానికి కట్టుకొని ఈత కొడుతూ వెళ్తుంటారు. సైకిల్ తొక్కేటప్పుడు మూడు చక్రాల బండిని సైకిల్ వెనక భాగంలో కట్టుకొని తీసువెళ్లేవారు. ఇలాగు ఇద్దరు కలిసి 70 కి పైగా పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని సార్లు పోటీలో తన కుమార్తెను కూడా మోసుకొని వెళ్ళవలసి వచ్చింది.
ఒక మారు సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, పరుగు పందెం అని ఒకే రోజు ఒక దాని తరువాత ఒకటి చేయవలసి వచ్చినప్పుడు తన కుమార్తెతో కూడా పాల్గొన్నారు. తన హ్యాండి క్యాప్ కుమార్తె పైన ఆయన చూపించిన కనికరము, దయను చూచిన ఆడియన్స్, విలేకర్లు " ఈ శతాబ్దపు గొప్ప తండ్రి " అని బిరుదు ఇచ్చి ఆయనను ఘనపరిచారు. ఎందుకు ఇలాగు చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన నా కుమార్తె పైన బయట గాలి వేగంగా తగలాలి అని ఆ గాలికి తన తల వెంట్రుకలు ఎగిరి తన మొఖం పైన పడాలి అని ఆశిస్తు ఉంటాది. ఆమె నా యొక్క హృదయము, నేను ఆమె యొక్క కాళ్లుగా పని చేస్తున్నాను. నా కంటే అమె అనేకులు యొక్క జీవితాన్ని మార్చివేసింది. మేము ఇద్దరం మంచి జట్టుగా ఉంటున్నాం అని ఉత్సాహంగా మంచి జవాబును ఇచ్చి అనేకులు మారుటకు కారణం అయ్యారు. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు అయిన మనము ఇలాగు మన పిల్లల్ని ప్రేమించిన యెడల మన అయిన దేవుడు మన మీద పెట్టుకున్న ప్రేమ ఇంకా ఎంతగా ఉంటుంది. ఆయన తన ఏకైక కుమారుడు అని చూడకుండా ఆయనను ఈ లోకానికి పంపించి సిలువలో మరణించుటకు అప్పగించారు కదా.
ఆయన ప్రేమకు సమానంగా మనము ఆయనను ప్రేమించాలి కదా. మనము ఆయనను ప్రేమించిన యెడల ఆయన నేను నా కూర్తెకు కాలుగా ఉంటున్నాను అని ఆ తండ్రి చెప్పినట్లుగా మనము దేవుని కాలుగా ఉంటూ దేవుని కొరకు ప్రకటించబడని స్థలమునకు వెళ్లి, ఆయన నోరుగా కష్టములో, శ్రమల మధ్యలో ఉంటున్న వారికి ఆదరణ ఇచ్చే వారిగాను, మంచం మీద పడిఉన్న వారికి మన చేతుల ద్వారా సహాయం చేస్తున్నా వారిగాను ఉండాలి గదా. అనేకులు యొక్క జీవితాన్ని తాకుటకు దేవుడు మనలను ఏర్పర్చుకున్నారు. మన ప్రేమ వలన మన యొక్క ఆదరణ మాటలు వలన అనేకులను దేవుని చెంతకు చేర్చుదాం. వారు దేవున్ని తెలుసుకొనుటకు ఆయన ప్రేమను ప్రకటిద్దాం. అలోచిద్దాం, పని చేద్దాం.
- బ్రదర్. హానిస్ సమూయేలు
ప్రార్థన అంశం:-
మన మిషనరీలను దేవుడు తన రక్తపు కంచెలో భద్ర పరిచేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250