Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.05.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 02.05.2021 (Kids Special)

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

స్వేటర్ రేట్ ఎంత?

"సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును". - 2కోరింథీయులకు 9: 7

హయ్! పిల్లలు ఎలా ఉన్నారు? ఈ దినము చర్చి కి వెళ్తారు కదా? సండే స్కూల్ కి కూడా వెళ్తారు కదా? మీ వలె ఐజక్ అనే తమ్ముడు చర్చ్ కి వెళ్ళాడు. చర్చ్ లో పాస్టర్ గారు చెప్పిన సందేశమును శ్రద్దగా వింటాడు. అదినము ఇతరులకు ఇచ్చుట గురించి పాస్టర్ గారు అనేక నిజ సంఘటనలు చెప్పారు. అది మాత్రమే కాక పక్క ఊరిలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి, అక్కడ ఉన్న  వృద్ధుల కొరకు, వాళ్ళు కప్పుకొనుటకు 200 దుప్పట్లు మన సంఘం నుండి కొని ఇవ్వాలి అనుకుంటున్నాను మీలో ఆశక్తి కలవారు సహాయం చేయవచ్చు అని ఒక పెద్ద అట్ట పెట్టెను వాళ్ళ ముందు పెట్టారు. సంఘస్తులు తమ యొద్ద ఉన్న డబ్బులను అందులో వేశారు. కొందరు అయితే చిల్లర డబ్బులను దాంట్లో వేశారు. ఐజక్ వీటన్నింటిని చూచి నా యొద్ద ఇచ్చుటకు ఏమి లేదే అనే బాధ వాడిలో ఉండేది. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. కొన్ని దినాలు ముందు నాన్న వాడికి కొని పెట్టిన స్వేటర్ ను తీసి యేసయ్య నా దగ్గర కొత్తది ఇది మాత్రమే ఉంది అని చెప్పి దానిని ఆ పాస్టర్ గారికి ఇచ్చి దీనిని ఎవరైనా తాతకు గాని, మామ్మకు గాని ఇవ్వండి అని చెప్పి నాకు యేసయ్య వేరే ఒకటి ఇస్తారు అని సంతోషంతో చెప్పారు. సంఘస్తులలో కొందరు అతనిని చూచి నవ్వారు. దాంట్లో ఒక ఆంటి మాత్రం నేను ఈ స్వేటర్ ను 1000 రూపాయలకు వేలం పాడుతున్నను అని అన్నారు. తరువాత 2000, 3000, అని వేలం పాట పెరిగింది. దాంట్లో ఒక డాక్టర్ 1,0,0000 లకు దానిని వేలం పాట పాడారు. చెక్ ను పాస్టర్ గారికి ఇచ్చి మళ్ళీ ఆ స్వేటర్ ను ఐజక్ కు కానుకగా ఇచ్చారు. వృద్ధుల ఆశ్రమమునకు కావలసిన 200 దుప్పట్లు, తలగడలు, నైటీలు, పంచలు కొన్నారు. అన్నీ కొనగా 70,000 మిగిలింది దీనిని ఏమి చేయాలి అని ఆలోచిస్తూ పాస్టర్ గారు మరియు విశ్వాసులు ఐజక్ గురించి ఆలోచిస్తూ ఐజక్ చాలా పేద కుటుంభం నుండి వచ్చినప్పటికీ ఆయనకు ఉండిన మంచి గుణమును ఘనపరచి ఆ 70,000 లతో ఒక రూమ్, టాయిలెట్, బాత్రూమ్ కట్టి ఇస్తే బాగుంటుంది అని నిర్ణయించు కున్నారు. అది మాత్రమే కాక వారిలో నుండి ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ లేచి ఈ 70,000 కు పైగా ఎంత అయినను దానిని నేను చూసుకుంటాను అని అన్నారు.

ప్రియమైన తమ్ముడు, చెల్లి ఈ. చిన్న బాబు చేసినట్లే మీరు కూడా ఉత్సాహంగా ఇచ్చేటప్పుడు అనేక రెట్లు దీవెన మరలా దేవుడు మీకు దయ చేస్తారు. 
-    శ్రీమతి. జాస్మిన్ పాల్ పాండి తురై

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)