Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 05.10.2024

దిన ధ్యానము(Telugu) 05.10.2024

 

అంశం: మన నిర్ణయము ఎట్లు 

 

"రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా" - దానియేలు 1:8

 

ప్రియమైన దేవుని పిల్లలారా ఒక కోతి అరణ్యంలో ఒక చెట్టు యొక్క పండ్లను రుచి చూసింది. కొన్ని గంటల్లోనే ఆ కోతికి విరోచనాలు పట్టుకున్నాయి. చాలా కష్టకరమైన పరిస్థితికి చేరుకున్నది అప్పుడు ఆ కోతి ఒక నిర్ణయం తీసుకున్నది. ఇక నేను ఎన్నడూ ఇటువైపు రాను ఈ పండ్లను తినను అని అనుకున్నది. కొన్ని దినములు గడిచాయి. ఆ కోతి ఆ పక్కకు వెళితే ఏముంది ఆ పండ్లను కొద్దిగా తింటే ఏముంది అని ఆలోచించి ఆ పండ్లను మరల తినడం ప్రారంభించింది. తనకు ఎలాంటి హాని కలగలేదు ఆ దినం వేరే ఏదో ఒక దాన్ని తినీ తర్వాతే పండ్లను తిన్నాను కాబట్టి అలా జరిగి ఉండి ఉంటుంది కాబట్టి ఇకనుండి నేను ఈ పండ్లు తింటాను అని అనుకున్నది. జరిగినది ఏమిటంటే కొన్ని గంటల్లోనే విరోచనాలు ఎక్కువై ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని చేరుకొని మరణించింది. దానికి గల కారణం అది ఒక విషపూరితమైన పండు.

 

బైబిల్లో రూతు అనే మోయాబు స్త్రీ ఒక నిర్ణయము తీసుకున్నది. (రూతు 1:14-17) సమస్థాన్ని కోల్పోయిన అత్తతో ప్రయాణించుటకు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏమిటి అంటే నీవు ఉంటున్న స్థలమే నా స్థలము, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప వేరే ఏదీ కూడా మనలను వేరు చేయనివ్వను అన్నది. ఆమె అదే నిర్ణయంతో జీవించి వచ్చింది దీవెనకరమైన జీవితాన్ని పొందుకున్నది. (మార్కు 13:13) లో చివరి వరకు నిలిచి ఉన్నవాడే రక్షింపబడును అని చెప్పబడుతుంది.

 

ప్రియమైన దేవుని పిల్లలారా మన ఆత్మీయ జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలలో ఈ దినము ఎలా నిలిచి ఉన్నాము? బలముగా ఉన్నామా లేక బలహీనపడి ఉన్నామా? మనల్ని ఎప్పుడైనా ఎలాగైనా మింగేస్తాను అని గర్జిస్తున్న సింహంవలె సాతానుడు రోజు గ్రద్ద వలే మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కోతి వలె ప్రారంభంలో నిర్ణయము దృఢముగా ఉండి కాలము గడుస్తున్న కొలది నిర్ణయము బలహీనమైనదిగా మారిపోయినదా? చివరికి అది బాదన కలిగించింది. కానీ రూతు యొక్క నిర్ణయము ప్రారంభం నుండి ముగింపు వరకు కదల్చబడకుండా దృఢముగా ఉన్నది. ఈ దినము మన ప్రతి ఒక్కరి యొక్క నిర్ణయము దృఢముగా ఉందా? అయితే ఖచ్చితముగా యేసుక్రీస్తు చేత మిక్కిలి ఫలితము పొందుకుంటాం. ఇవ్వబడిన పరిచర్య లేక పని, వ్యాపారము, కుటుంబము వీటన్నింటిలో దేవుని యొక్క నిర్ణయం చొప్పున మనము నడుచుకొనిన యెడల విజయము కచ్చితం, విడుదల నిశ్చయము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్! 

- పాస్టర్. ఎస్. ఏ. ఇమ్మానుయేల్ గారు 

 

ప్రార్థన అంశం:-

25 వేల గ్రామాలలో సువార్త ప్రకటించే ప్రణాళికలో ప్రార్థించే ప్రార్థన గుంపులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)