దిన ధ్యానము(Telugu) 04.10.2024
దిన ధ్యానము(Telugu) 04.10.2024
అంశం: కాల్ చేయుడి
"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15
శ్యామ్ తన నాలుగు సంవత్సరాల కుమార్తె సారా కి రోజు రాత్రి పడుకునే ముందు బైబిల్ కథలు చెప్పుట అలవాటు. కథ వింటూ నిద్రపోయేది సారా. ఆ దినము యోసేపు జీవితంలో జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభించాడు. యోసేపు తండ్రి ఇంటిలో ముద్దుబిడ్డ. పదిమంది అన్నయ్యలు ఒక తమ్ముడు అనే సహోదరులు ఉండేవారు. ఆయన నాన్నకు లోబడి ఉండేవాడు. దేవునికి భయపడినవాడు. అన్నయ్యలు ఎలాంటి తప్పులు చేసినా వెంటనే తన నాన్నకు చెప్పుట చేత అందరూ యోసేపును ద్వేషించారు. ఒకరోజు తన అన్నయ్యలను, మందను చూచుటకు దూర ప్రాంతమునకు పంపించారు నాన్న. అసూయగల అన్నయ్యలు యోసేపును కట్టి నీళ్లు లేని ఒక గోతిలో పడవేశారు. మధ్యలో సారా నాన్న యోసేపు వెంటనే నాన్నకు ఫోన్ చేసి చెప్పవచ్చు కదా అని ప్రశ్నించింది. వెంటనే శ్యాముకు ఆశ్చర్యం అనిపించింది. తన కుమార్తె ఎంత చక్కగా ఆలోచిస్తుంది అనుకున్నాడు.
అవును సారా యొక్క ప్రశ్న అర్థవంతమైనదే. అది 100 రెట్లు నిజమే ఎవరికైనా కూడా తనకు ప్రమాదం వచ్చే సమయంలో తన తండ్రికి కేక పెట్టి పిలుచుట హక్కు అనే గ్రహింపును సారా అర్థం చేసుకుంది. అవును మనకు పరమ తండ్రి అయిన యేసయ్య ఉన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను ఆయనను పిలుచుటకు హక్కు మనకు ఇచ్చి ఉన్నారు (కీర్తన 91:15) లో ఆయన నాకు మొర పెట్టగా నేను వాళ్లను విడిపించెదను వాళ్ళ ఘనపరిచేదను (కీర్తనలు 91:5)లో చదువుతున్నాం. ఆపత్కాలంలో నేనే వారితో ఉండి బలవంతులుగా చేస్తాను అనియు ఫిలిప్పి 4:6 మీరు చింతింపకుండా సమస్తమును గూర్చి విజ్ఞాపనతోను, కృతజ్ఞత స్తుతులతో, ప్రార్థనతోనూ దేవునికి తెలియజేయుడి అని చెప్పి ఉన్నారు.
ప్రియమైన వారలారా! మీకు ఎవరు లేరు అని తలంచి కలతలో ఉన్నారా? యేసయ్య! దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేక వేసినా బర్తిమై అనే గుడ్డివాడితో నేను నీకు ఏమి చేయాలి అని అడిగినప్పుడు నేను చూపు పొందుకోవాలి అని అడిగాడు. అందుకు ఆయన నీవు చూపు పొందుదువుగా కానీ అన్నారు. పెద్ద కార్యమని అడిగాడు ఆయన చూపులు ఇవ్వగలరు అని విశ్వాసంతో అడిగాడు పొందుకున్నాడు. (లూకా 18: 41-42) ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు ఇవ్వబడును. జవాబు ఇచ్చే దేవుడు మనకి ఉన్నారు కనుక మీరు కూడా అడగవచ్చు. ఆయన కచ్చితంగా దయ చేస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్!
- శ్రీమతి. ఏమిమా సౌందర్ రాజన్
ప్రార్థన అంశం:-
25వేల గ్రామాలకు సువార్త ప్రకటించుటకు అవసరమైన కరపత్రికలు మరియు సంపూర్ణ బైబిల్ దొరికేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250