Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 22.04.2021

దిన ధ్యానము(Telugu) 22.04.2021

చేసినవి చెప్పబడును:-

"సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను " - మత్తయి 26: 13

1743వ సంవత్సరము డేవిడ్ బ్రైనాడ్ ఆయన తన 25వ సంవత్సరం లో స్కాట్లాండ్ మిషనరీ సంస్థ ద్వారా అమెరికాకు మిషనరీ గా పంపించబడ్డారు.  అక్కడ ఉన్న  ఆంగ్లోఇండియన్ మధ్యలో ప్రయాస పడి పరిచర్య చేశారు. మోకాళ్ళ మీదే అనేక రాత్రుళ్లను గడిపారు.రోజుల గడుస్తున్న కొద్ది ఆయన టీ.బీ  రోగముతో పీడింపబడ్డారు. అంధునిమిత్తం రక్తపు వంతులు చేయడం మొదలుపెట్టారు. ఎక్కువ బలహీనంగా ఉండినప్పటికి ఆయన తనలో ఉన్న బలమైన పరిశుద్దాత్ముని చేత ఆంగ్లో ఇండియన్స్ లను దేవుని ప్రేమలోనికి నడిపించుటకు గొప్ప పాత్రగా వాడబడ్డారు. ఆయన యొక్క పరిచర్య 4సంవత్సరాలు మాత్రమే. ఆయన తన 29వ ఏట పభునందు నిద్రించినప్పటికి ఆయన పరిచర్యను ఈ దినము వరకు గుర్తు చేసుకున్నంతగా ఆయన జీవితము ఉండేది. ఆయన వ్రాసిన డైరీ  కార్యాలన్నింటినికూడా సమకూర్చి వ్రాసిన పుస్తకము ఈ దినమువరకు కూడా అనేకులను ఉత్సాహపరుస్తూ వస్తుంది. ఇందు నిమిత్తము ప్రార్ధించుటకు తమను సమర్పించుకున్న వారు, పరిచర్య చేయుటకు సమర్పించుకున్నవారు అనేకులు.

బైబిల్ ల్లో కూడా ఒక స్త్రీ విలువ కలిగిన అత్తరుఅనే ద్రవ్యాన్ని తీసుకువచ్చి యేసుక్రీస్తు తలమీద పోసింది. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు ఈ సువార్త ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రసంగించబడుతుందో  అక్కడ ఈమె చేసినది కూడా గుర్తుచేయబడుతుంది. 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! డేవిడ్ బ్రైనాడ్ ఈ లోకంలో చేసిన పరిచర్య దినాలు చాలా తక్కువ ఆయన పరిచర్య గురించి ఈ దినం వరకు అనేకులు చెప్పుకొన తగినదిగా ఆయన జీవిత చరిత్ర ఉండేది. ఆయన జీవితం ఈ దినం వరకు అనేక యవ్వనస్తులను పరిచర్యకు నడిపించేటట్లు సవాలుగా నిలబడుతుంది. ఆయన జీవించిన జీవితం ఈ దినం వరకు క్రైస్తవ ప్రపంచంలో వినబడుతూ వస్తుంది. అత్తరు పోసిన స్త్రీ గురించి వేలకొలది సంవత్సరాలు ఐనప్పటికి మనము ఈ దినం వరకు మాట్లాడుకుంటున్నాం. మనయొక్క జీవితము, మన యొక్క పనులు ఇతరులకు ప్రయోజన కరముగా ఉండనివ్వండి. ఈ లోకంలో మనుష్యుల వలన మనము మెప్పు పొందలేక పోయినను పరలోకంలో మనం చేసే కార్యాలు దేవుని  వలన గుర్తు చేయబడుతుంది. 
-    ఈ. పుణ్ శేఖర్,

ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము, దినధ్యానము ప్రతి నెల ముద్రించుటకు అవసరమైన ధన సహాయం అందేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)