By Village Missionary Movement
Tuesday, 18-Jun-2024దిన ధ్యానము(Telugu) 18.06.2024
అంశం:- దేవుని ప్రేమ.
"ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము" - రోమీయులకు 8:36
దేవుని కొరకు దేనినైనా పోగొట్టుకుంటాను గాని దేవుని ప్రేమ నుండి నేను ఎడబాయను అని అన్నాడు డేవిడ్ లిదింగ్స్టన్. ఆయన హృదయం అంతా కూడా ఆఫ్రికా దేశ ప్రజలు దేవుని ప్రేమను తెలుసుకోవాలి అనే భారంతో నిండి ఉండేది. దానితో ఆఫ్రికా దేశంలో పరిచర్య ప్రారంభించారు. అనేకమైన కష్టాలు, శ్రమలు ఎదుర్కొన్నారు. వెంటనే ఆయన పంపించిన మిషనరీ సమస్త లివింగ్స్టన్ మీరు మరలా తిరిగి వచ్చేయండి అక్కడ ఉండి మీరు పరిచర్య నెరవేర్చింది చాలు అని అన్నారు. అయినప్పటికీ ఆయన పరిచర్య విడిచిపెట్టి వెనకకు రాలేదు. ఆయన పరిచర్యకు వెళ్లేటప్పుడు ఒక మారు సింహం వచ్చి ఆయన చేతులను కరిచింది అయినప్పటికీ ఆయన తన పరిచర్య చేస్తూ వచ్చారు. అనేక రకములైన విష జ్వరములు లివింగ్స్టన్ ను అనేక ఇబ్బందులు పెట్టాయి. సరైన ఆహారం లేకుండా శరీరం చాలా బలహీనపడింది వెంటనే మిషనరీ సమస్త మీ భార్యను, పిల్లలను పోగొట్టుకున్నారు మీ శరీరము బలహీనపడింది ఇకనైనా మీరు అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేయండి అని పిలిచారు కానీ లివింగ్స్టన్ అయితే నా ప్రాణం పోయే వరకు నేను ఆఫ్రికా ప్రజలను విడిచిపెట్టి రాను వారికి దేవున్ని ప్రకటిస్తాను అని తిరిగి వచ్చేది లేదు అని ఖచ్చితంగా చెప్పారు. ఏ దినము కూడా దేవుడు ఆయనను ఎక్కడ విడిచిపెట్టలేదు.
పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు గురించి మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ కొరకు ఎక్కువగా దెబ్బలు కాసారు. చెరసాలలో ఉంచబడ్డారు, అనేకసార్లు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మరియు యూదుల చేత కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఓడ ప్రమాదంలో ఉన్నారు, అనేకసార్లు నిద్రలేమి, ఆకలి ఇలాంటివి అన్ని ఆయన క్రైస్తవ ప్రజల కొరకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పౌలును దర్శించిన యేసుప్రభును వెంబడించే వ్యక్తిగా పౌలు మారాడు. మంచి సేవకుడిగా ఆయన మారుటకు కారణమిదే.
ప్రియమైన వారలారా! ఈ ప్రపంచంలో పాపమునకు బానిసలుగా ఉంటున్న మనలను యేసయ్య తన రక్తము కార్చి మనలను తన సొంత బిడ్డలుగా చేర్చుకున్నారు. అనేక సమయాల్లో మనం ఆ ప్రేమను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాం. యేసయ్య ప్రేమ ఎన్నడు మారనది. ఈ దినము వరకు మనము ఉంటున్న విధముగానే మనల్ని ప్రేమిస్తున్నారు అందువలన ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఏది దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు అని ధైర్యం తెచ్చుకుని ఆయన కొరకు పని చేద్దాం. ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటిద్దాం. ఆమెన్!
- బ్రదర్. క్రిస్టోఫర్ గారు
ప్రార్థన అంశం:-
ఒక లక్ష మంది చిన్నారులకు చిల్డ్రన్ క్యాంపు ల ద్వారా సువార్తను ప్రకటించేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250