Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.06.2024
Share:

By Village Missionary Movement

Monday, 17-Jun-2024

దిన ధ్యానము(Telugu) 17.06.2024

 

అంశం:- పిలువుడి

 

"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15

 

ఇతియోఫియా దేశంలో ఒక యవ్వనస్థురాలు క్రూరమైన కొంతమంది వ్యక్తులు చేతిలో చిక్కబడింది. ఆ వ్యక్తులు ఆ స్త్రీని ఎవరు లేని అరణ్యమునకు తీసుకుని వెళ్లి ఆమెను పాడుచేసి హత్య చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారము ఆ స్త్రీని ఎవరూ లేని అడవి ప్రాంతంలోనికి తీసుకుని వెళ్లారు. ఆ క్రూరులు యొద్ద చిక్కుకొని ఉన్న ఆమె కేకలు వేస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అయినప్పటికీ కాపాడుటకు ఏ ఒక్కరు రాలేదు. ఆ క్రూరులు హేళన చేసి నవ్వారు నిన్ను కాపాడుటకు ఇక్కడ ఎవరూ లేరు అని హేళన చేశారు. అలసిపోయిన ఆమె యొక్క చేతులు ఆకాశం వైపు ఆమె హస్తములను చాపి యేసయ్య మీరు ఉన్నారు నన్ను కాపాడండి అని గొప్ప స్వరముతో పిలిచింది. ఆమె స్వరమును దేవుడు విన్నారు. దేవుడు ఆ అడవిలో గల సింహములకు ఆజ్ఞాపించారు. కొన్ని సింహాలు వాళ్ళ మీద పడి ఆ క్రూరమైన వ్యక్తులను చంపివేశాయి. ఆ స్త్రీని అయితే ఏమీ కూడా చేయలేదు ఎంత ఆశ్చర్యమో చూడండి. 

 

బైబిల్లో దానియేలు దేవుని వెదకుటలో యదార్ధముగా ఉన్నాడు. ఆయనను ద్వేషించిన వారు దానియేలు దేవుని ఎదుట ప్రార్ధించిన కార్యాన్ని ఎత్తి చూపించారు. ఏ మనుష్యుడు కూడా 30 రోజులు రాజును తప్ప వేరే ఎవరిని కూడా ఏ దేవుడినైనను, మనుష్యుడనైనను ప్రార్థించకూడదు అని ఆజ్ఞను తీసుకుని వచ్చారు. ప్రార్థించిన వారిని సింహముల బోనులో పడవేయాలి అని చట్టం తీసుకుని వచ్చారు. ఆ చట్టము ఉన్నప్పటికీ దానియేలు యధావిధిగా దేవుని వెతికినందున సింహముల బోనులో పడవేయబడ్డాడు. అయితే దానియేలు సింహలో బోన్లో నుండి సింహముల బధకముల నుండి విడిపించబడ్డాడు. 

 

ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు అరుచుచున్న కాకులకు కూడా ఆహారము ఇచ్చే దేవుడు. మరి అలాంటప్పుడు మీరు పిలిచేటప్పుడు మిమ్మల్ని గమనించకుండా ఉంటాడా? కచ్చితంగా సాయం చేస్తాడు. మీరు ఆపద కాలంలో నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు అని అనుకుంటే ఆయన మీ కొరకు తన దూతలను మీకు సహాయం చేయడానికి ఏర్పాటు చేస్తారు. మీ పరిస్థితి ఏదైనా వాటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. ప్రమాద సమయాల్లో మీరు మనుషులను నమ్ముకోనుట కంటే దేవున్ని నమ్ముకుంటే మేలు. ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపిస్తారు. మీరు ఆయన నామాన్ని మహిమ పరుస్తారు. ఆమెన్! 

- శ్రీమతి. ప్రేమలత గారు 

 

ప్రార్థన అంశం:-

ఆకలి గల వారికి ఆహారం ఇచ్చుట అనే పరిచర్య ద్వారా దర్శింపబడుతున్న అనేకులు దేవుని ప్రేమను ఏరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al