By Village Missionary Movement
Thursday, 11-Apr-2024దిన ధ్యానము(Telugu) 11.04.2024
అంశం: మార్గదర్శి
"ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను" - 1 పేతురు 2:21
మనమందరము ఎవరో ఒకరిని వెంబడిస్తూ ఉంటాం. చిన్నప్రాయంలో తల్లిదండ్రులను చూసి వాళ్ళు వలే జీవించడం ప్రారంభిస్తాం. తర్వాత ఉపాధ్యాయులు మరియు మనకు నచ్చిన వ్యక్తులను చూసినప్పుడల్లా వాళ్లను వెంబడించి జీవించడం ప్రారంభిస్తాం. యవ్వన ప్రాయంలో క్రికెట్ ఆటగాళ్లు లేక సినిమా హీరోలను వెంబడించడం. ఎదుగుతున్న కొలది నచ్చిన రాజకీయ నాయకులను మన జీవితంలో మాదిరిగా పెట్టుకొని జీవించడం ప్రారంభిస్తాం. అందరికంటే చాలా శ్రేష్టమైన మాదిరి కరమైన జీవితం జీవించిన వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. యేసుప్రభు భూమి పైన జీవించిన దినములలో జీవితమునకు అవసరమైన మాదిరి కరమైన జీవితాన్ని అనేక కార్యముల ద్వారా మనము తెలుసుకొనవచ్చు. వాటిలో కొన్ని కార్యాలను ఈ దినం మనం ధ్యానిద్దాం.
ప్రేమ:-
ఆయన ప్రేమ చూపించడంలో మాదిరిని చూపించారు. ఆయన తన యొక్క శిష్యులు మీద ప్రేమను చూపించారు. యేసు తన యొక్క శిష్యులను స్నేహితుడు అని పిలిచారు. మానవజాతికి తమ యొక్క జీవితాన్ని ఇచ్చి తన యొక్క ప్రేమను వ్యక్తపరిచారు.
దీనత్వం:-
యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణము వరకు లోబడిన వారిగా తన్నుతాను తగ్గించుకున్నారు. (ఫిలిప్పీయులకు రాసిన 2: 6- 8) ఇంకను యేసయ్య తన యొక్క తగ్గింపుని వ్యక్తపరచుటకు అనేక విధములుగా తమ శిష్యులతో తన తగ్గింపును చూపించారు. శిష్యుల యొక్క పాదములు కడిగారు. ఎంత గొప్ప తగ్గింపు! ఆయన దీనత్వం మరణం వరకు కొనసాగింది. మనము నిజమైన దీనత్వం గల వారిముగా జీవిద్దాం.
పరిశుద్ధమైన జీవితం:-
ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవిస్తున్న దినాలలో పరిశుద్ధముగా నిరపరాధిగా జీవించి చూపించారు. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా జీవించుడి అని జీవించి వెళ్లారు. యేసుప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితమును చూచి మనము కూడా వెంబడిద్దాం. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ దేవుని చూడలేరు.
క్షమాపణ:-
ఇతరులను క్షమించుట అన్నది అవసరమైన ఒక కార్యము యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో ఇతరుల యొక్క నేరములను తాము క్షమించుటకు వాళ్లు చేసిన నేరమును క్షమించుము అని ప్రార్థించుట నేర్పించారు. మన యొక్క యేసయ్య వాళ్ళని క్షమించి అంగీకరించినది మనము ఇతరులకు నేర్పించవలసిన కార్యం.
దీనిని చదువుతున్న దేవుని ప్రియమైన వారలారా! మన జీవితంలో శ్రేష్టమైన మార్గదర్శకముగా యేసు ప్రభువు లోకంలో జీవించి వెళ్లారు. ఆయన చూపించిన అడుగుజాడల్లో నడిచి ఆయన అడుగుజాడలు వెంబడించి దీవెనలు పొందుకుందాం. పరిపాలించే మారుదాం. ఆమెన్!
- శ్రీమతి. భువన ధన బాలన్ గారు
ప్రార్థన అంశం:-
ఫిలిప్ గాస్పల్ టీం ద్వారా దర్శింపబడుతున్న యవనస్తుల కొరకు మనం ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250