By Village Missionary Movement
Thursday, 04-Sep-2025దిన ధ్యానము(Telugu) 04.09.2025
అంశం: అబద్ధం చెప్పకండి
“నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;” - లేవీయకాండము 19:11
మధురం అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు. అతనికి నది ఒడ్డున ఐదు ఎకరాల మంచి భూమి మరియు ఐదు ఎకరాల రాతి భూమి ఉంది. నది ఒడ్డున ఉన్న భూమి బాగా పెరిగి సమృద్ధిగా పంటలు పండేది. కానీ రాళ్లతో ఉన్న భూమి సాగుకు నోచుకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు మధురం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. ఇద్దరు కొడుకులు వంతులవారీగా తండ్రిని చూసుకున్నారు. అతని ఆరోగ్యం క్షీణించడంతో, అతను తన పెద్ద కొడుకును పిలిచి, "నువ్వు మరియు నీ సోదరుడు ఎటువంటి గొడవలు లేకుండా నదీతీర భూమి మరియు రాతి భూమి రెండింటినీ సమానంగా పంచుకోండి అని చెప్పి అతను మరణించాడు.
చిన్న కొడుకు తన అన్నయ్యని అడిగాడు, “చనిపోయే ముందు నాన్న ఏం చెప్పారు?” అందుకు అన్నయ్య ఇలా బదులిచ్చాడు, “నన్ను నది ఒడ్డున ఉన్న ఐదెకరాలు తీసుకోమని నిన్ను రాతి భూమిని తీసుకోమని చెప్పారు అన్నాడు. చిన్న కొడుకు తన తండ్రి మాటను గౌరవించి, రాతి భూమిని బాగు చేయడం ప్రారంభించాడు, అతను రాళ్ళు తీసి మరమ్మత్తు చేయడంతో, రాళ్ళు మెరుస్తూ వచ్చాయి, వెంటనే వాటిని తన స్నేహితుడికి చూపించాడు. వారు వాటిని చూసి ఇది చాలా ఖరీదైన గ్రానైట్ రాయి అని చెప్పారు. ఆయన వెంటనే అక్కడ ఒక కంపెనీ పెట్టీ చాలా ధనం సంపాదించాడు. దానిని చూసిన అన్నయ్య తన తమ్ముడ్ని మోసం చేసినందుకు చాలా బాధపడ్డాడు.
పై వాక్యం ఏమి చెబుతోంది? ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకండి. తమ్ముడిని మోసం చేసేందుకు అన్నయ్య అబద్ధం చెప్పాడు. అయితే అసలు ఎవరు మోసపోయారు? అన్నయ్య. ఇంతలో తనను మోసం చేసిన అన్నయ్య తాను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. కాలక్రమేణా, నదీతీర భూమి ఎండిపోయి, బీడుగా మారింది, తమ్ముడు ధనవంతుడు కాగా, అన్నయ్య పేదవాడు అయ్యాడు. బైబిల్లో, అబద్ధాలు చెప్పి తమ జీవితాలను నాశనం చేసుకున్న అననియా మరియు సప్ఫీరా గురించి మనకు తెలుసు. పేతురుకు ఈ విషయం తెలియదని వారు భావించారు, కానీ వారు తమను తాము మోసం చేసుకున్నారు.
జాగ్రత్త! మోసపోవద్దు. మనం కూడా ఏదో ఒకరోజు మోసపోతాం.అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. (సామెతలు 21:6) యేసు మీద నమ్మకం ఉంచండి. తగిన సమయంలో యేసు నీవు ఉన్న స్తితిలోనుండి పైకి లేపుతాడు. కాబట్టి మనం అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను మోసగించడం చేయకూడదు. యేసు మనలను ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా!
- రెవ.ఎస్.ఎ.ఇమ్మాన్యుయేల్ గారు
ప్రార్ధన అంశం:-
మేలుకొలుపు యువజన శిబిరంలో పాల్గొన్న వారు తమకు లభించిన అభిషేకానికి కాపలాగా ఉండాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250