Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.01.2025
Share:

By Village Missionary Movement

Monday, 27-Jan-2025

దిన ధ్యానము(Telugu) 27.01.2025

 

అంశం: మాట్లాడే దేవుడు

 

"యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది" - కీర్తనలు 29:4

 

నా బంధువులో ఒకరు ప్రభువును తెలియని వారు యాక్సిడెంట్‌కు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త విన్న వెంటనే, నేను ఆయన కోసం ప్రార్థించాను. నా ప్రార్థన స్నేహితులకూ చెప్పి, వారినీ ప్రార్థన చేయమని అడిగాను. అయితే ప్రార్థన వృథాగా అనిపించింది. అదే రోజు ఆయన మరణించారు. ఆయనను రక్షించుటకు దేవుడు ఎందుకు చర్య తీసుకోలేదని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే మరణించారు. నా ప్రతిదిన బైబిల్ ధ్యానంలో బైబిల్ చదవడం ప్రారంభించగా, దేవుడు నాకు ఆదికాండము 4, 5 అధ్యాయాల ద్వారా మాట్లాడాడు. కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని కొట్టి చంపెను.

 

తర్వాత, ఆ వ్యక్తి జీవితాన్ని వెనక్కి చూసినప్పుడు, ఆయన సోదరుడు తన చెల్లిని ఉరివేసి చంపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించి, దేవుడు ఎలా మాట్లాడుతాడో ఆశ్చర్యపోయాను.

 

మనము దేవుని నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచి మాట్లాడితే, దేవుడు మనతో మాట్లాడుతాడు. మన పరిస్థితి ఎలా ఉన్నా, ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తాడు.

 

యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు, గుడ్డివాడు యేసు ఆ మార్గమున వస్తున్నాడు అని విని, ఆయనను నమ్మి పిలిచాడు. వెంటనే, యేసును అనుసరించేవారు ఆ గ్రుడ్డివాడిని మందలించారు. కానీ యేసు ఆగి, వాడిని పిలిపించి, వాడితో మాట్లాడారు. ఆయన వాడికి ఏం కావాలో ముందే తెలిసిన, వాడితో మాట్లాడటమే ఆయనకు ఇష్టం. మనం ఆయనను నిజాయితీగా వెతికితే, నమ్మితే, ఆయన మన మాటలన్నింటిని వింటాడు, జవాబు ఇస్తాడు.

 

ప్రియమైన వారలారా, మీ బాధలను వినేవారు, మీ కన్నీళ్లు చూసేవారు ఎవరూ లేరని అనిపిస్తుందా? మనుషులు విడిచిపెట్టినప్పుడు, మనతో మాట్లాడేవారు ఎవరూ లేరని భావిస్తున్నారా? దేవుడు ఈ రోజు కూడా మాట్లాడే దేవుడు. మీరు చెప్పేదేదైనా వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనను నమ్మి ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడుతాడు. హలెలూయా!

- సిస్టర్. రాజి గారు

 

ప్రార్థనా అంశం:

ఉత్తర భారతదేశ మిషనరీలు తమ ప్రాంతాలలో తమ పనిని నెరవేర్చాలని ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al