Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.01.2023

దిన ధ్యానము(Telugu) 27.01.2023

 

అంశం:- 11వ గంట సేవకుడు

 

"కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. "(మత్తయి సువార్త 9:37) 

 

ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఒక అతను తన అనుభవమును ఈ విధముగా పంచుకున్నారు. చాలా కంపెనీలలో అనేక శాఖలో నేను పని చేశాను. ఒక కంపెనీ యొక్క పై అధికారి నాతో కోపముగా మాట్లాడి పనిని చేయమంటారు. కాని నెల చివరిలో వచ్చే జీతమును జ్ఞాపకము చేసుకొని నా మనసును ఓదార్చుకుని పనిచేస్తున్నాను. ఇంకా ఏమంటారు అంటే 50 శాతం జీతం పనిచేయడానికి ఇంకో 50% జీతం తిట్లు కాయడానికి అని చెప్తూ ఉంటారు. ఈ మాట మనకు తమాషాగా ఉన్నప్పటికీ ఒక కఠినమైన మనసుతో అతను ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. 

 

మత్తయి సువార్త 20:1-16 వచనాల్లో మన పరమ తండ్రి ద్రాక్ష తోటలో కూలికి వచ్చే వారి కొరకు వారు పొందుకున్న జీతం కొరకు మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదేమనగా ప్రైవేట్ కంపెనీలలో పని చేసే సమయమును బట్టి జీతం తీసుకుంటాం. కాని యేసయ్యా ద్రాక్ష తోటలో అందరికీ ఒకే విధమైన జీతం కాని సమయం అయితే వేరువేరుగా ఉంటుంది. మనం ప్రైవేటు కంపెనీలలో పనిని వెతుక్కుంటూ వెళ్తున్నాం కాని ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పని కొరకు ఆయన మనలను వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతున్నారు. 

 

ప్రియమైన వారలారా! లోక కార్యములను ప్రతికూలముగా చేయడం మనకు అలవాటు అయిపోయింది. అపవాది నిజమును అబద్ధమును కలిపి మనలను మార్చేశాడు. అదెలా అంటే పిలుపు లేని ప్రైవేటు కంపెనీలలో పనిచేయడానికి మనంతట మనమే తీవ్రంగా పరిగెడుతున్నాం. ఇది ఒక వైపు అయితే మరొకవైపు తన ద్రాక్ష తోటలో పని కొరకు చేతులు చాపి నిలబడినటువంటి యేసయ్యను మనము పట్టించుకోవడం లేదు. నన్ను విడిచి దూరముగా వెళ్లి మాయను వెంబడించి వ్యర్ధముగా జీవించుటకు నా యొద్ద ఏ లోటును చూశారు అని యేసయ్య కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు ఆయన స్వరమును వింటే మీ హృదయములను కఠిన పరుచుకొనవద్దు. యేసుక్రీస్తు యొక్క ద్రాక్ష తోటలో చివరి వరకు పనికి పనివారిని పిలుస్తున్నారు. మా సంస్థ ద్వారా ఒక గంట సేవ చేయుటకు సమర్పించుకున్న వారి కొరకు 11వ గంట సేవకుడు అనే ప్రణాళికను ఏర్పరిచి వారిని కొంచెం సమయం సేవ చేయుటకు ఉత్సాహ పరుస్తున్నాం. వారికి అవసరమైన సువార్త పత్రికలను నూతన నిబంధనలను ఉచితముగా ఇస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి దేవుని సేవ చేయుటకు ముందుకు రండి. 

- శ్రీమతి. సరోజ మోహన్ దాస్ గారు

 

ప్రార్థన అంశం:

ఆకలి గొనిన వారికి ఆహారము అందించే ప్రణాళిక ద్వారా సంధింపబడుతున్న వ్యక్తులు యేసయ్య ప్రేమను రుచిచూచులాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)