దిన ధ్యానము(Telugu) 13.05.2025
దిన ధ్యానము(Telugu) 13.05.2025
అంశం: దేవుని చిత్తానికి సమర్పించండి
“నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను” - యెషయా 46:11
నా పెద్ద కొడుకు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత, అతను అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కొనసాగించాలని అనుకున్నాడు. అయితే, ప్రవేశ పరీక్ష రోజు, కొన్ని అనుకోనని ఆటంకాలు కారణంగా, అతను సమయానికి పరీక్ష హాలుకు చేరుకోలేకపోయాడు. అతను పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యాడు. అతను నిరుత్సాహంగా నిలబడి ఉండగా, పరీక్ష రాయడం ముగించిన అతని స్నేహితుల్లో ఒకరు బయటకు వచ్చి, యేసు మీ కోసం గొప్ప ప్లాన్ చేసాడు అని ఆతను నిశ్శబ్దంగా వచ్చి ఈ విషయాన్ని నాతో పంచుకున్నాడు. తరువాత రోజుల్లో, దేవుడు అతను ఊహించిన దానికంటే బాగా ఉన్నత చదువులు చదివేలా చేసి, అతని జీవితంలో తన ప్రణాళికను నెరవేర్చి ఆశీర్వదించాడు.
అన్నీ మన ప్రణాళిక ప్రకారం, మన ఇష్టానుసారం జరగాలని చాలాసార్లు అనుకుంటాం. అవి మంచివి, నిజాయితీ మరియు సరైనవి అయినప్పటికీ, మన ఇష్టానుసారం విషయాలు జరగనప్పుడు మనం చాలా నిరాశ చెందుతాము. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం విషయాలు జరిగినప్పుడు, మన జీవితాలు మనం ఊహించిన దానికంటే చాలా అందంగా ఉంటాయి.
ఆదికాండము 39 మరియు 40 అధ్యాయాలలో, మనము యోసేపు జీవితాన్ని చూస్తాము. అతను తన తండ్రికి ఇష్టమైన కొడుకుగా జీవించాడు మరియు అతని జీవితంలో దేవుని ప్రణాళిక కారణంగా కొన్ని ఊహించని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అతను ఎటువంటి కారణం లేకుండా 11 సంవత్సరాలు జైలులో ఉన్నప్పుడు, యోసేపు అక్కడ ఉన్న పానదాయకుని కలకి అర్థం చెప్పాడు. అతను విడుదలై తిరిగి పనిలోకి వచ్చినప్పుడు, అతను ఫరోకు తన గురించి చెప్పి విడుదల చేయమని అడుగుతాడు. కానీ పానదాయకుడు దాని గురించి రెండేళ్లుగా మర్చిపోతాడు. అతను ఫరోకు చెప్పి ఉంటే, అతను యోసేపును పిలిచి, అతనిని విచారించి, ఇశ్రాయేలు దేశానికి తిరిగి పంపించి ఉండవచ్చు. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. యోసేపు ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మన దేవుడు మనల్ని మనం కోరుకునే దానికంటే మెరుగైన స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతని ప్రేమ అంత గొప్పది.
దేవుని ప్రియమైన పిల్లలారా! మన జీవితాల పట్ల దేవునికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. కాబట్టి, మనకు వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని విషయాలు మరియు పరిస్థితులను చూసి మనం నిరుత్సాహపడకూడదు. మన జీవితాలను ఆయన చిత్తానికి అప్పగించి జీవించినప్పుడు, దేవుడు తన ప్రణాళికను మనలో అమలు చేయగలడు.
- శ్రీమతి. జెబక్కని శేఖర్ గారు
ప్రార్థన అంశం:
VBS పరిచర్య ద్వారా చాలా మంది పిల్లలు రక్షించబడాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250