Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 11.05.2025 ( Kids Special)

దిన ధ్యానము(Telugu) 11.05.2025 ( Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు 

 

అంశం: పైన ఎలుగుబంటి మరియు క్రింద సింహం

 

“కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు” - కీర్తనలు 37:27

 

హాయ్ చిన్న పిల్లలు! మీరు అన్ని జంతువులను ఇష్టపడుతున్నారా? అడవిలో ఉన్న జంతువుల పేర్లు చెప్తారా చూద్దాం. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు, జింక.. హ అన్నీ చాలా బాగా చెప్పారు. ఈ రోజు మనం అన్ని జంతువులను వేటాడే ఇద్దరు సోదరుల కథను వినబోతున్నాము.

 

రవి మరియు రాజా ఇద్దరు సన్నిహితులు, వారు అద్భుతమైన వేటగాళ్ళు. ఒకరోజు ఇద్దరూ వేటకు అడవికి వెళ్లారు. జంతువులను వేటాడాలనే ఆత్రుతతో ఇద్దరూ విడిపోయారు. రవి చాలా దూరం అడవిలోకి వెళ్లి జంతువుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక్కసారిగా సింహగర్జన విని వెనుదిరిగాడు. సింహం అతని వైపు వచ్చింది. రవి భయంతో వెనుదిరిగి చూడకుండా పరిగెత్తాడు, పరిగెత్తుకొచ్చి చెట్టు ఎక్కాడు. సింహం కూడా అతనిని అనుసరించి ఆ చెట్టు కింద నిలబడింది. రవి అలసిపోయి పైకి చూశాడు. అక్కడ ఒక కొమ్మ మీద ఉన్న ఎలుగుబంటిని చూశాడు. క్రింద సింహం మరియు పైన ఎలుగుబంటి. ఇది చూసిన రవికి ఏం చేయాలో తెలియక చేతులు, కాళ్లు వణికిపోయాయి.

 

ఆ సమయంలో సింహం ఎలుగుబంటిని చూసి ఈ మనుషులే మనకు శత్రువులు అని చెప్పింది. కాబట్టి అతన్ని కిందకు త్రోసివేయ్యి ఇద్దరం ఆహారంగా పంచుకుందాము అన్నది సింహము. ఎలుగుబంటి నో అని చెప్పింది, కానీ తెలిసి తెలియక, అతను నా దగ్గరకు వచ్చాడు. అతనికి హాని చేయనని చెప్పింది. సింహం కోపంగా చెట్టు కింద నిలబడింది. కొద్దిసేపటికే ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు సింహం రవి వైపు చూసి, "అయ్యా, నాకు ఇప్పుడు మాంసం కావాలి, కాబట్టి, నిద్రిస్తున్న ఎలుగుబంటిని కిందకు త్రోసేయండి, నేను దానిని తిని వెళ్లిపోతాను, మీరు కూడా భయపడకుండా మీ ఇంటికి వెళ్ళవచ్చు అన్నది." రవికి ఇది మంచి ఆలోచన. కాబట్టి, అతను దానిని క్రిందికి నెట్టడానికి ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికి ఎలుగుబంటికి మెలకువ వచ్చింది. వెంటనే సింహం ఎలుగుబంటితో, "ఇది చూసావా? తన తెలివితేటలు చూపించాడు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలస్యం చేయకు వెంటనే అతనిని క్రిందికి నెట్టండి." కానీ ఎలుగుబంటి, "అతను నాకు హాని కలిగించడానికి ప్రయత్నించినప్పటికీ, నన్ను ఆశ్రయించిన వ్యక్తికి నేను ద్రోహం చేయను అన్నది." సింహం కూడా వెళ్లిపోయింది. ఇదంతా గమనిస్తున్న రవి తన తప్పు తెలుసుకుని ఎలుగుబంటికి క్షమాపణలు చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు.

 

ప్రియమైన పిల్లలారా! మనం ఎప్పుడూ ఇతరులకు చెడు చేయకూడదు. యేసయ్యకు అది అస్సలు నచ్చదు. అలాగే మనకు మేలు చేసిన వారికి చెడు చేయాలని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు.

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)