Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 30.05.2023

దిన ధ్యానము(Telugu) 30.05.2023

 

అంశం: పొగడ్తలు

 

"ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము" - గలతియులకు 5:26

 

కొన్ని సంవత్సరాలకు మునుపు మిషనరీ బయోగ్రఫీ కలిగిన ఒక మాస పత్రికలో ఇలా ప్రచురించబడింది. లండన్ మిషనరీ సంఘం వారు దక్షిణాఫ్రికాలో గల తమ ఫీల్డ్ లో ట్రాన్స్ఫర్ కారణంగా ఒక కొత్త మిషనరీ ని పరిచర్యలో పెట్టుకున్నారు. ఆ మిషనరీ కుటుంబము ఓడ ద్వారా దక్షిణాఫ్రికా చేరుకున్న తర్వాత సముద్ర తీరంలో ఆ ఫీల్డ్ లో ఉన్న విశ్వాసులు శ్రేష్టమైన ఆహ్వానం పలికారు. గొప్ప ఘనమైన వాయిద్యాలతో పూలను జల్లుతూ నాట్యం చేస్తూ ఆహ్వానం పలికారు. దానిని చూసిన పూర్వపు మిషనరీ బాధపడ్డారు. విలపించడం ప్రారంభించారు. ఈ ఫీల్డ్ ని ప్రారంభించింది నేనే. అడవిలో, కొండల్లో తిరుగుతూ ఈ ప్రజలను రక్షణలోనికి నడిపించాను. ఇంత చేసిన నా ఘనత ఎక్కడ? అని దుఃఖపడ్డారు. ఈ తలంపులు ఆయనను పరిచర్యలో వెనకంజ వేసేటట్లు చేశాయి. 

 

మనుషులు ఘనపరచాలి, సమాజంలో నాకంటూ ఒక స్థానం ఉండాలి అనే ఆలోచనతో మనం కనబడిన యెడల బైబిల్ మనకు చెబుతున్న ప్రేమ కలిగిన సలహా ఏమిటి అంటే దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము (సామెతలు 25: 27). ఎవరు నన్ను పట్టించుకోలేదు, నేను ఈ కార్యము కొరకు ఎంత ప్రయాసపడ్డాను, వీళ్ళకు కృతజ్ఞత లేదే అని అంగలారిస్తూ ఉన్న హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నేను చేసిన సత్కార్యముల కొరకు అందరూ నన్ను పొగడాలి అని తలంచి ఎదురుచూస్తున్నప్పుడు మీరు చేసిన సత్కార్యమునకు ఫలితము ఈ ప్రజల వద్ద పొందుకుంటున్నారు. 

 

దేవుడు దాని కొరకు మీకు ఇవ్వాలనుకున్న దీవెనలు మీరు పొందుకోలేకపోతున్నారు. అలాగే ఇతరులు పొగడబడుతున్నప్పుడు మీ గుండె మండిపోకూడదు. అసూయతో ఏర్పడుతున్న ఈ కార్యము కూడా పాపమే. కాబట్టి పొగడ్తలను, ఘనతను ఎదురు చూసి ఏ పని కూడా చేయకండి. మీ హృదయము పొగడ్తల వైపు ఘనతవైపు మళ్ళించబడకుండా ఉండేటప్పుడు దేవుడు ఇహమందు పరమందు మనం చేసిన ప్రతి కార్యానికి ఖచ్చితముగా ఫలితము దయ చేస్తారు.

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:

ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ అనే ఉత్తర భారత దేశంలో జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడై ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)