Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.05.2023

దిన ధ్యానము(Telugu) 27.05.2023

 

అంశం: ఆత్మీయులు ఎవరు? 

 

"నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు" - గలతియులకు 5:16

 

ఎవరు ఆత్మీయ క్రైస్తవులు అనే ప్రశ్నకు ప్రతి క్రైస్తవ సమాజంలోనూ భిన్నమైన ఈ మాటలు చెప్పబడుతున్నాయి. కొన్ని సంఘాలలో ఉత్సాహంగా పాటలు పాడుతూ, హల్లెలూయ అని ఉత్సాహధ్వని చేసేవారే ఆత్మీయులు అని ఎంచబడుతున్నారు. కొన్ని సమయాలలో విస్తారమైన ప్రార్థన చేసేవారు ఆత్మీయులుగా ఎంచబడుతున్నారు. 

 

పైన చెప్పబడిన కార్యాలు ఆత్మీయుడు అని చెప్పబడడానికి గుర్తుగా ఉండినప్పటికీ ఇవన్నీ కూడా బయటకు కనబడుతున్న కార్యాలుగా ఉండి నందున ఒక వ్యక్తిని ఆత్మీయుడు అని వీటిని బట్టి చెప్పలేము. నిజముగా ఆత్మీయుడు అని పిలవబడే వాడు కొన్ని లోతైన కోరికలను కలిగి ఉంటారు. అవి వారి యొక్క సంపూర్ణ జీవితాన్ని పరిపాలిస్తుంది. వాటిలో కొన్నింటిని ఈ క్రింద చూద్దాం. 

 

1. ఆత్మీయుడు సంతోషముగా ఉండుట కంటే పరిశుద్ధముగా ఉండుటయే కోరుకుంటాడు కానీ ఈ దినపు క్రైస్తవ సమాజం పరిశుద్ధత కంటే పరవశమునే ఎక్కువగా ఆశిస్తూ ఉంది. 

 

2. ఆత్మీయుడు సిలువను మోయుటకు ఆశిస్తాడు. అనేకమంది క్రైస్తవులు తమ అనుదిన జీవితంలో వచ్చే శ్రమలు మరియు రోగాలు వీటన్నింటిని సిలువ అని అనుకుంటున్నారు. అలాగైతే క్రీస్తులో లేని వారికి కూడా ఇలాంటి శ్రమలు వస్తున్నాయి కదా! మరి సిలువ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క కట్టడలను గైకొనినప్పుడు వచ్చే అధికమైన సమస్యలే సిలువ అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఈ సిలువను మోయుటకు ప్రభువు ఎప్పుడును కూడా మనలను బలవంతం చేయరు. మారుగా ఒక ఆత్మీయుడు ఫలితములు ఎరిగే తన్నుతానుగా సిలువను మోసుకుంటూ వెళ్తాడు. 

 

3. ఆత్మీయుడు ఇతరుల యొక్క పొగడ్తలను కోరుకొనక దేనిని చేసిన ఆయన దేవుని యొక్క మెప్పు కొరకే మనస్ఫూర్తిగా చేస్తాడు. 

 

4. ఆత్మీయ క్రైస్తవుడు ఇతరులు హెచ్చింపబడినప్పుడు సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి దగ్గర అసూయ లేదు. నాకు గుర్తింపు లేదు నాకు బదులుగా వేరే ఒకరు ఘనపరచబడుతున్నారు అని ఎన్నడును వాడు కృంగిపోడు. 

 

5. ఆత్మీయుడు లోకము మనలను పొగడాలి అనే ఆశించకుండా దేవుని కొరకు ప్రయోజనమైన జీవితమును జీవించాలి అని ప్రయాస పడుతూ ఉంటాడు. 

 

పైన చెప్పబడిన కార్యాలు ఒక ఆత్మీయ క్రైస్తవుడు ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేవి కావు. పరిశుద్ధాత్ముడు వాడిలో ఉండి నడిపించే క్రియలే ఇవన్నీ. 

- ఏ. డబ్ల్యు. టోసర్ గారు 

 

ప్రార్థన అంశం: 

మన క్యాంపస్ లో ఉన్న హాస్పటల్ కు వైద్యం కొరకు వస్తున్న రోగులు దేవుని ప్రేమను రుచి చూసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)