Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.05.2023

దిన ధ్యానము(Telugu) 26.05.2023

 

అంశం: ఏది విజయం

 

“ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?” - రోమీయులకు 8:31

 

జర్మన్ దేశం యొక్క చక్రవర్తి అయిన బ్యాట్రిక్ గారు బెర్లిన్ అనే నగరం గుండా వెళుతూ ఉన్నాడు. అక్కడ ఒకచోట గోడకు తగిలించి ఉన్న ఒక చిత్రాన్ని చూచుటకు ప్రజలు అనేకమంది గుమకూడి ఉన్నారు. ఈ చక్రవర్తి కూడా అదేమిటో గమనించుటకు అక్కడ నిలబడ్డారు. అక్కడ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో బ్యాట్రిక్ యొక్క బొమ్మ హేళనగా గీయబడి అక్కడ వేలాడుతూ ఉంది. అతడు దానిని ఒక క్షణం పరిశీలించి చూశాడు హృదయంలో ముల్లు గుచ్చుకున్నట్లు అయి చాలా దుఃఖపడ్డాడు. తరువాత తన పని వాళ్ళని పిలిచి అది అందరికీ కనిపించే విధముగా ఆ బొమ్మను కిందకు దించి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనను కించపరచాలి అని తలంచిన శత్రువుకు ఇది చాలా బాధ కలిగించింది. దానిని బట్టి వారు తలదించుకున్నారు. 

 

ప్రియమైన వారలారా! మీరు మీ కుటుంబంలో, పని స్థలాలలో క్రీస్తు నిమిత్తము తృణీకరించబడి హేళన చేయబడి ఉండవచ్చు. చేయని నేరారూపణను బట్టి మీ హృదయం గాయపరచబడి ఉండవచ్చు. మిక్కిలి వేదన గల ఈ అనుభవమునకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దీనిని మీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకే దేవుడు అనుమతించారని సహనముతో అంగీకరించండి. అప్పుడు ఇటువంటి పరిస్థితుల ద్వారా మిమ్మల్ని నిరుత్సాహపరచాలి అని అనుకున్నటువంటి సాతానుడు అపజయం పొందుతాడు. మీరు విజయం పొందుతారు. 

 

మీరు దేవుని కొరకు యదార్థముగా పరిచర్య చేసినప్పటికీ ఇతరుల యొక్క కఠినమైన విమర్శకరమైన మాటలతో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు దానిని దేవుని కొరకు సహనముతో సహించిన యడల అదే మీ విజయం. 

 

మీరు శ్రమల గుండా నడుస్తూ వెళ్ళినప్పుడు క్రీస్తు ద్వారా వస్తున్న సిలువను మోసేటప్పుడు దేవుని గురించి సనుగు కొనకుండా శోధనను సహించువాడు ధన్యుడు (యాకోబు1:12 ) అనే వాక్యాన్ని గుర్తుంచుకుని జీవించిన యెడల అదే మీకు విజయవంతమైన జీవితం. 

 

చివరిగా జీవితంలో ఇంపైన సమయము కంటే కఠినమైన సమయముల ద్వారా దేవుడు ఇంకనూ అత్యధికముగా మీకు బోధించుటకును మిమ్మల్ని తీర్చిదిద్దుటకు ఆ సమయాన్ని వాడుకుంటున్నారు అనేదాన్ని మరిచిపోకండి. మీరు నలగగొట్టబడుతున్న సమయంలో ఇంకా లోతుగా , ఆయన రూపంలో ఆయన దగ్గరకు చేరుతున్నారు అనే దానిని మర్చిపోకుడి. మిమ్మల్ని ఆయన పోలికలో మార్చడానికి ఆయన ఈ కార్యాన్ని అనుమతించారు అనే దానిని గుర్తుంచుకొనుడి. 

- బ్రదర్. ఎస్. పరమ శివన్ గారు

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో ఆకలి గల వారికి ఆహారం ఇచ్చే ప్రణాళిక ద్వారా దర్శించబడుతున్న ఆత్మల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)