Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 21.05.2023 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 21.05.2023 (Kids Special)

 

అంశం: నిజమైన స్నేహితులు

 

"మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును" - సామెతలు 27:6

 

సమ్మర్ సెలవులు వచ్చేసాయి. అందరూ జాలిగా ఉన్నారు కదూ! ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఎక్కువగా నీళ్లు తాగాలి. తల్లిదండ్రు చెప్పే మాటలు వినాలి. సరేనా మీ అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా దాంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్లు మంచి వాళ్లేనా అని చూసి నడుచుకోవాలి. దాని గురించే ఈరోజు ఒక కథ వినబోతున్నాం. మరి కథ విందామా? 

 

ఒక అడవిలో గాడిద, పులి ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఏంట్రా ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారు అవకాశమే లేదే అని ఆలోచిస్తున్నారా పరవాలేదు రండి వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో మనం విందాం. పులిని చూచి గాడిద చెప్పింది ఆ గడ్డిని చూసావా ఎంత అందంగా ఉందో నీలం రంగులో ఆ గడ్డి ఉంది కదూ అన్నది గాడిద. లేదు ఆ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది కదా అన్నది పులి. ఇలా నీలం రంగు అని ఆకుపచ్చ రంగు అని ఇద్దరు వాదించుకున్నారు. హఠాత్తుగా ఆ మార్గంలో గుండా వచ్చిన అడవికి రాజైన సింహము వీళ్ళ సమస్యను చూసింది. విషయాన్ని తెలుసుకుంది. రాజైన సింహము ఆలోచించి ఆ పులికి ఒక వారం రోజులు ఆహారం ఇవ్వకూడదు అనే శిక్ష వేసింది. అప్పుడు పులి రాజుతో అయ్యా సింహరాజా గడ్డి ఆకుపచ్చగానే ఉంది కదా మరి నేను చెప్పింది తప్పు కాదు కదా అని అడిగింది. అందుకు సింహం నీవు చెప్పింది తప్పు కాదు. అడవికి మంత్రి వంటి నీవు ఒక గాడితో స్నేహం చేస్తున్నావ్. నీవు చెబుతున్న మాటను అంగీకరించని స్నేహితుడు ఒక స్నేహితుడేనా? నీవు నీ బాధ్యతను గ్రహించకుండా ఒక చిన్న కార్యము కొరకు ఈ గాడితో గొడవలాడుతున్నావ్ అందుకొరకే నీకు ఈ శిక్ష పడింది అన్నది సింహం. 

 

మంచి స్నేహితులు ఎంత ప్రాముఖ్యమో అని మీరు గ్రహించారు కదా? మీ జీవితంలో కూడా మంచి స్నేహితులు ఉండాలని ప్రార్థన చేయాలి. చెడ్డ స్నేహితులు ఉండినా నీవు వాళ్లను మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత నీకు ఉంది. మంచి స్నేహితులకు గుర్తు మీరు తప్పు చేసిన ఎడల దాన్ని ఖండించి మిమ్మల్ని బాగు చేయాలి. కాబట్టి మీరు మంచి పిల్లలుగా ఉండాలి మీ స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించాలి. సరైనా పిల్లలు! 

- శ్రీమతి. దేబోరా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)