Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 17.05.2023

దిన ధ్యానము(Telugu) 17.05.2023

 

అంశం: అవసరమైన కన్నీళ్లు

 

"నేను బహుగా ఏడ్చుచుండగా" - ప్రకటన గ్రంథం 5:4

 

పరిశుద్ధ గ్రంథము కన్నీళ్ళతో రాయబడిన ఒక పుస్తకము. కన్నీళ్లతో చదువుతున్న వాళ్లకు మాత్రమే తనలో ఉన్న నిధిని వారికిస్తుంది. ఏదో సమయము గడపడానికనో లేక చదవాలి కాబట్టి చదువుతున్నాము అనే వాళ్లకు దేవుడు దేనిని బయలుపరచుడు. 

 

కన్నీళ్లు తోనూ భయముతోనూ సీనాయి కొండపైన దేవుని సన్నిధిలో వేచి ఉండిన మోషేతో దేవుడు మాట్లాడేను. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు బదులుగా తన పేరును జీవగ్రంధములో నుండి తుడిసి వేయమని మోషే చేసిన ప్రార్థనతో ఆ దేశము కాపాడబడేను. దానియేలు యొక్క కన్నీటితో కూడిన ఉపవాస ప్రార్థన పరలోకము నుండి గాబ్రియేలు దేవదూత క్రిందకి వచ్చి దైవ రహస్యములను బయలుపరిచెను. ప్రకటన గ్రంథములో ముద్రించబడిన పుస్తకమును తెరచి చూడడానికి ఒక్కరును కనిపించకపోవడం వలన యేసుని ప్రియమైన శిష్యులైన యోహాను చూసినప్పుడు కన్నీటితో ఏడ్చెను. వెంటనే ఒకడు యోహానును ఓదార్చి యూదా రాజ సింహమైన యేసుక్రీస్తు ప్రభువు దానిని పగలగొట్టుటకు జయము పొందిన్నాడని చెప్పెను. కీర్తనల గ్రంథంలో చాలా పుస్తకములు కన్నీటితో రాయబడియున్నవి. 

 

లోకం యొక్క ఉజ్జివ షరతులను మనము చూసినప్పుడు చాలామంది సేవకులు, సువార్తికులు నశించిపోతున్న లోకము కోసము కన్నీటితో దేవుని సన్నిధిలో ఏడుస్తున్న వారిగా ఉన్నారు. దేవుడైన యెహోవా దుఃఖ హృదయమును కలిగి ఉన్నారు అని రాయబడినట్లు వీరు కూడా దుఃఖ హృదయమును కలిగి ఉన్నారు. 

 

ఈరోజు క్రైస్తవ్యంలో చూస్తున్న పెద్ద లోటు ఏమిటంటే పగిలిన హృదయము లేకపోవుట మరియు కన్నీటి ప్రార్థన లేదు. బైబిల్ ను బోధిస్తున్న బోధకులు చాలామంది కన్నీళ్లు లేని సేవ చేస్తుండడం వలన సేవ ఫలించడం లేదు. విశ్వాసులలో నశించిపోతున్న ఆత్మలను గురించిన భారం తక్కువగా ఉన్నది. ఇలాగు నేను చెప్పినప్పుడు ఏదో మనము ఏడవాలని ఏడిస్తే అది పనిచేయదు. అలా చేసి మనము దేనినైనా సాధించగలము అని తలంచకూడదు. ఇది మన హృదయము నుంచి వచ్చిన భారం కాదు. క్రైస్తవులు ఒక్కొక్కరు ఆ విధముగా కన్నీటి ప్రార్థన చేయుటకు అది వారి హృదయంలో నుండి భారముగా బయటకు రావాలి. ఈరోజు క్రైస్తవ లోకంలో ముఖ్యమైనవి ఏమనగా దేవునికి లోబడి ఉండటం, భయభక్తులు కలిగి ఉండుట, పగిలిన హృదయము మరియు కన్నీటి ప్రార్థన కలిగి ఉండటం వీటిని దేవుడు మనకు దయచేయును గాక! 

 

ఎక్కడ చూసినా నశించిపోతున్న ఆత్మలను పాపముతో నిండి ఉన్న ప్రజలను ఈ చివరి రోజుల్లో కన్నీళ్లతోనూ ప్రార్థన చేయవలసిన బాధ్యత మన ఒక్కొక్కరి పైన ఉన్నది. అలాంటి ఆత్మల పట్ల కలిగిన భారమును దేవుడు మనకు దయచేయును గాక! 

- ఎ. డబ్ల్యు .టోసర్ గారు

 

ప్రార్థన అంశం

తేనీ ఫీల్డ్ లో రమ్య అనే సహోదరికి దేవుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుటకును అదేవిధంగా మనతో కలిసి సేవ చేస్తున్న వారి కుటుంబములలో రక్షణ లేని ప్రజలకు

దేవుడు రక్షణను కలుగజేయులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)