Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 16.05.2023

దిన ధ్యానము(Telugu) 16.05.2023

 

అంశం: దేవుని ఆలాపన

 

"నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ" - 1 కోరింథీయులకు 9:16

 

బైబిల్ కళాశాలలో టీచర్ గా పని చేసిన ఒకరు కర్ణాటకలో పరిచర్య చేసి వచ్చారు. ఒక దినం సాయంకాలము సంఘములో గల ఒక తల్లితో కలిసి కరపత్రికలు పంచే పరిచర్య చేసేసి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ టీచర్ యొక్క హృదయంలో దేవుడు ఒక ప్రేరేపన కలిగించారు. ఈ ఇంటికి వెళ్ళు సువార్త ప్రకటించు అన్నారు. ప్రభువా నేను చాలా అలసిపోయి ఉన్నాను రేపు కచ్చితంగా వెళ్లి చెబుతాను అని చెప్పి ఇంటికి వచ్చేసారు. మరలా ప్రభువు ఆమెను ఆ ఇంటికి వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆ టీచర్ అయితే అదే జవాబు చెప్పేసి పడుకుండిపోయారు. 

 

మరుసటి రోజు ఉదయమున ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ నిలబడి ఉన్న వారి యొక్క మొఖాలు చూస్తే దుఃఖముతో నిండిపోయి ఉంది. ఒక వ్యక్తిని ఆమె అడిగినప్పుడు ఈ ఇంటిలో గల వ్యక్తి నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పాడు. దానిని విన్న వెంటనే ఆమె హృదయం పగిలిపోయింది. తన శరీర అలసటను లెక్కచేయకుండా పనిచేసి ఉంటే ఆ వ్యక్తిని దేవుని కొరకు సంపాదించి ఉండవచ్చు అని చాలా బాధపడ్డారు. దీనిని మా బైబిల్ కాలేజీలో ఆ టీచర్ చెబుతున్నప్పుడు కన్నీరు కార్చారు. 

 

ఈ సంఘటన నుండి మనము ప్రభు యొక్క హృదయాన్ని ఆయన యొక్క ఆలాపనను చూస్తున్నాం. క్రీస్తు కొరకు ఎలాంటి వెలనైనా చెల్లించడానికి మన హృదయంలో సిద్ధంగా ఉండాలి. ప్రతి వ్యక్తి మీద దేవుడు చూపిస్తున్న కనికరాన్ని చూడగలుగుతున్నాం. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. ఈ లోకంలో కోట్ల కొలది మంది ప్రజలు ఉండగా ఎక్కడో మూలన వున్న నన్ను దేవుడు చూస్తారా? నా ప్రార్థన ఆలకిస్తారా? అని ఆలోచించవచ్చు. కానీ దేవుని హృదయాన్ని చూడండి ఒక తల్లి తన బిడ్డ ఆహారం తీసుకొనకపోతే మరల మరల అడుగుతున్నట్లు దేవుడు ఆ ఒక్క వ్యక్తి కొరకు మరల మరల ఆ టీచర్ తో మాట్లాడారు. దేవుని యొక్క హృదయా ఆలాపన ఎలా ఉందో చూడండి. 

 

ప్రియమైన వారలారా! క్రీస్తు కొరకు చిన్నచిన్న కార్యాలను త్యాగం చేసి ఆయన కొరకు ప్రయత్నం చేద్దాం. ఇంటికి వచ్చే పాలు వేసే అతను, కూరగాయలు అమ్ముతున్న మామ్మ, చెత్త తీసుకోవడానికి వస్తున్న అమ్మ, బట్టలు ఇస్త్రీ చేయడానికి వచ్చిన అన్నయ్య, పాత్రలు కడగడానికి వస్తున్నటువంటి సహోదరి వీరందరికీ ఒకసారైనా ప్రభువు గురించి చెబుతున్నామా? వారిలో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి అన్నది దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన 100 శాతం అలాగే ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన ఆలాపనను మీ భారముగా అంగీకరించి పనిచేస్తారా? అందుకొరకు ఎలాంటి వెలనైనను చెల్లించుటకు ముందుకు వస్తారా? 

- శ్రీమతి. రూతు అనీష్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులు మరియు ఆఫీస్ పనుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)