Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.05.2023

దిన ధ్యానము(Telugu) 15.05.2023

 

అంశం: నో

 

"జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే" - సామెతలు 6:32 

 

మిక్కిలి విలువ కలిగిన యవ్వనులారా వివాహమునకు మునుపు లైంగిక సంబంధములు అన్నది ఒక తప్పిదమైన కార్యము. ఇది మన జీవితాన్నే నిర్మూలము చేసేస్తుంది. వివాహమునకు మునుపు లైంగిక సంబంధములో ఉండకూడదు అనేదానికి శ్రేష్టమైన కొన్ని కారణములను చూద్దాం. 

 

1. వివాహమునకు మునుపు వివాహమునకు బయట లైంగిక సంబంధములు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. నిర్గమకాండము 20: 14 మారుగా వివాహ బంధములోనే లైంగిక సంబంధాలు ఉండాలి అని ఆయన నిర్ణయించి ఉన్నారు. 

 

2. వివాహమునకు మునుపు లైంగిక సంబంధాలు వద్దు అని మీరు నిర్ణయించినప్పుడు అనేక విధములైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నిరుత్సాహాలు మరియు చింతల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనుచున్నారు. మీరు దేవుని పోలికలో సృష్టించబడి ఉన్నారు. మీ ఘనతను ఇతరులు హేళన చేసేటట్లు నడుచుకొనకుడి. 

 

3. వివాహమునకు మునుపు ఈ కార్యములో మీరు పాల్గొన్నప్పుడు మీరు ప్రేమించబడుటలేదు మారుగా మీరు వాడబడుతున్నారు అనే దాన్ని మర్చిపోకండి. 

 

4. యవ్వన సహోదరిలారా వివాహమునకు మునుపు తప్పిదమైన లైంగిక సంబంధాల ద్వారా పిల్లలను మీ గర్భంలో పొందుకొనే ప్రమాదం ఉంది. ఇందువలన సమాజంలో మీకు గొప్ప అవమానము కలుగుతుంది. అబార్షన్ చేయుట హత్య దానివలన ప్రాణమునకే హాని కలుగుతుంది. 

 

5. వివాహమునకు మునుపు ఈ పాపపు క్రియా వద్దు అని మీరు నిర్ణయించుకున్నప్పుడు నయం చేయలేని ప్రమాదకరమైన ఎయిడ్స్ వంటి రోగముల నుండి మీరు తప్పించబడుతున్నారు. 

 

6. వివాహమునకు ముందు లైంగిక బంధము మీ భవిష్యత్తును పాడుచేస్తుంది. దానివలన మీ చదువు మధ్యలో ఆగిపోవచ్చు లేదా మీ పనులు యొక్క అవకాశాలను మీరు కోల్పోవచ్చు. 

 

7. వివాహమునకు మునుపు ఈ లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు దేవుడు మీ కొరకు సిద్ధం చేసిన మీ జీవిత భాగస్వామ్యమును మీరు కోల్పోతున్నారు. 

 

దీనిని చదువుతున్న వివాహమైన సహోదరులారా పైన చెప్పబడిన సలహాలు మీకు కూడా వర్తిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉందాం. 

- జూన్ కార్ ల్యాండ్ గారు

 

ప్రార్థన అంశం:

వి.బి.ఎస్ పరిచర్య కొరకు వాలంటీర్లుగా వస్తున్న యవ్వనులను దేవుడు బలంగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)