Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 13.05.2023

దిన ధ్యానము(Telugu) 13.05.2023

 

అంశం: ప్రార్థనతో కూడిన క్రియ

 

"నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా"? - యాకోబు 2:14

 

కుమార్ ఒక ఆసక్తి గల దేవుని భక్తుడు ఉన్నాడు. ఆయనకు హాకీ ఆట అంటే చాలా ఇష్టం. కాబట్టి తను ఎలాగైనా హాకీ చాపియన్ కావాలనేది వాడి యొక్క శ్వాసగా మారిపోయింది. ప్రతి దినము ప్రభువా నన్ను చాంపినగా చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. రోజు దేని గురించి ప్రార్థన చేయకపోవడం మర్చిపోయిన ఈ హాకీ ఆటోలో ఛాంపియన్ కోసం ప్రార్థన మాత్రం మర్చిపోడు. ఒక దినము ఆయన ప్రభువా నేను చిన్నప్పుడు నుండి ఎన్నో దినాలుగా నన్ను హాకీలో మంచి ఆటగాడిగా చేయండి అని అడుగుతున్నాను మరి నాకు ఏదైనా చేసి ఉన్నారా అని అడిగాడు. వెంటనే ప్రభువు నాకు నిన్ను ఛాంపియన్గా మార్చాలి అని ఆశగానే ఉంది కానీ నీవు మైదానంలోనికి వెళ్లి ఆడితే కదా నిన్ను ఛాంపినగా మార్చగలను. నీవు ఇంట్లో ఉంటూ టీవీలో హాకీ ఆటను చూస్తూ ఉంటే నీ కోరికను నేను ఎలాగ నెరవేర్చగలను అని అన్నారంట. ఈ దినము మనలో అనేకులు ఈ యవ్వనస్తుడు వలె ఉంటున్నాం. 

 

దీనిని జాగ్రత్తగా చూసిన యెడల బడిలో చదువుతున్న విద్యార్థులు ప్రయాసతో చదవకుండా యధావిధిగా ఉండిపోయి పరీక్ష సమయంలో భక్తితో దేవుని వెతుకుతూ ఉంటారు. ప్రభువు వాళ్ల కొరకు ఏదైనా చేయగలరా? కాలేజ్ చదువుతున్నప్పుడు మనము మన యొక్క జీవితంతో ఎంజాయ్ చేస్తాము అని చెప్పి మొబైల్, ఇంటర్నెట్ అని దినములను సమయాన్ని వ్యర్థము చేసి పరీక్షలు వచ్చిన వెంటనే అమ్మమ్మ, నాన్నమ్మ నా కొరకు ప్రార్థించండి అని చెప్పి పుస్తకాన్ని తెరిచిన యెడల అన్ని కొత్తగా కనబడతాయి. మన కనులు కట్టేసి అడవిలో విడిచిపెట్టినట్లు ఉంటుంది. ఆ దినము ఎంత కన్నీరు కార్చిన ప్రయోజనం కలదా? 

 

మనలో అనేకులు బైబిలు చదవడం లేదు కానీ ప్రభువా బైబిల్ లో గల మరుగైన సత్యములను నాకు చూపించండి అంతరంగంలో ఉంటున్న నిధులను నాకు చూపించండి ఎవరికి బైబిల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే జవాబు ఇచ్చేవాడిగా నైపుణ్యత గలవాడిగా నన్ను మార్చండి అని ప్రార్థిస్తున్నాం. ప్రభువు దానికి ఏం జవాబు చెబుతారు? మొట్టమొదటిగా మీ బైబిల్ ను క్రమముగా ప్రతిరోజు ప్రార్థనతో ఆసక్తితో చదువు తర్వాత నేను నీకు మరుగైన కార్యములను బయలుపరుస్తానని అంటారు. 

 

ప్రియమైన వారలారా! మనము మన ఆత్మీయ జీవితము లో అభిషేకం పొందుకోవాలని పరిశుద్ధముగా జీవించాలని దేవుని దర్శించాలని అనేక ఆశలు కలిగి ఉన్నాము. కానీ దాని కొరకు ప్రయాసపడి వేచియుండి ప్రార్థిస్తున్నామా? క్రియ లేని విశ్వాసము మృతమై ఉన్నట్టు విశ్వాసం లేని క్రియ కూడా వ్యర్థమే. 

- శ్రీమతి. నందిని సెల్విన్ గారు 

 

ప్రార్థనా అంశం:

ఆమెన్ విలేజ్ టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్న యవ్వనస్తులు మరియు చిన్నారులు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)