Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 09.05.2023

దిన ధ్యానము(Telugu) 09.05.2023

 

అంశం: మాట్లాడుకుందాం. 

 

"సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది" - సామెతలు 25:11

 

నూతనముగా వివాహము జరిగిన దంపతులు ఉద్యోగము కొరకు గ్రామము నుండి పట్టణమునకు వెళ్లారు. వారి ఉంటున్న ఇంట్లో గోడపై చిన్న అద్దము అతికించబడి ఉంది. ఇంతవరకు ఆ అద్దాలు ఎప్పుడూ చూడని ఆ వ్యక్తి అందులో తన ముఖమును చూసినప్పుడు తన తండ్రిని చూసినట్లు ఉండేది. అలా చూసినప్పుడల్లా తనలో చాలా సంతోషము కలిగేది. కాబట్టి ప్రతిరోజు ఉదయమున లేచిన వెంటనే ఆ అద్దము యొద్దకు వెళ్లి తన ముఖమును చూసి తన తండ్రిని చూశాను అని అనుకోని సంతోషంగా ఉద్యోగానికి వెళ్తాడు. కొన్ని రోజులుగా దీనిని గమనించిన భార్య ఒకరోజు తన భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ అద్దమును చూసింది. అందులో ఒక అందమైన అమ్మాయి మొఖము కనిపించింది. వెంటనే భార్య ఆశ్చర్యపోయింది. ఆ నిమిషము నుండి తనకు భర్త పైన అనుమానం మొదలైంది. తన మనసులో నెమ్మది నీ కోల్పోయింది. ఇంటి పనులను కూడా చేయలేక చాలా కృంగిపోయింది. ఒకరోజు ఆ బాధను భరించలేక పక్కింటి బామ్మతో తన ఇంట్లో గల స్థితిని చెప్పింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంటికి వచ్చిన బామ్మ నవ్వుతు ఇద్దరిని అద్దము ముందు నిలబెట్టి ఇది అద్దము దాని ముందు నిలబడే వారి ముఖమే అందులో కనబడుతుంది అని చెప్పింది. భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుని సందేహలు అన్నింటినీ సరి చేసుకోండి. మొదటి రోజు నీ భర్త ప్రవర్తన చూసినప్పుడే దీనిని గూర్చి అడిగి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు అని చెప్పి బామ్మ వెళ్లిపోయింది. 

 

ఇస్సాకు రిబ్క అనే దంపతులు గూర్చి ఆదికాండంలో చదువుతున్నాం. వారికి ఏసావు మరియు యాకోబు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇద్దరి కుమారుల పెంపకమును ప్రేమించుటను గూర్చి ఒకరికొకరు మాట్లాడి ఏకమనస్సు కలిగి ఉండటం విడిచి తండ్రి ఒకరిని తల్లి ఒకరిని ప్రేమించారు. తర్వాత రోజుల్లో ఈ మనస్పర్ధలు వలన ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు ఏర్పడి ఒకరు ఇంకొకరిని చంపాలి అని అంతలా ద్వేషం పెరిగింది. 

 

ప్రియమైన వారలారా! మీ జీవితం ఎలా ఉంది? రోజువారి పని, భవిష్యత్తు ప్రణాళికలు, పిల్లల చదువు, రోజువారి ఖర్చులను గూర్చి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుని విషయమును పంచుకొనండి. మౌనంగా ఉండి ద్వేషమును పెంచుకున్నట్లయితే అనవసరమైన సమస్యలు సందేహాలు, ఎడబాటులో కలుగుతాయి. దేవుడు మనలను పరిశీలించినప్పుడు మనము కూడా ఒకరికొకరు పరిశీలిస్తూ మన కుటుంబాలను ప్రేమతో కట్టుకుందాం. 

- శ్రీమతి. అనిత అలగర్ స్వామి గారు 

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీవీ మూలముగా సంధింపబడుతున్న ప్రతి ఒక్క ఆత్మ దేవుని ప్రేమను రుచి చూచులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)