Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 08.05.2023

దిన ధ్యానము(Telugu) 08.05.2023

 

అంశం: శోధన

 

"మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి(లేక-కీడునుండి) మమ్మును తప్పించుము" - మత్తయి 6:13 

 

ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి. శోధనలు గురించి బైబిల్ లో చూసినట్లయితే అబ్రహం యొక్క విశ్వాసం శోధించబడింది. యేసుక్రీస్తు ప్రభువు సాతాను చే శోధింపబడ్డారు. యోబు సువర్ణము వలె మారుటకు శోధింపబడ్డాడు. యోసేపుకు పాపపు శోధన వచ్చింది. ఇలా ఏదో ఒక విషయం మూలముగా మనము శోధింపబడుతూ ఉంటాం. ఈరోజు యోసేపు జీవితంలో జరిగిన శోధనలను అధిగమించి అతను సాధించిన విజయములను మనము చూద్దాం. 

 

యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉన్నాడు ఇతడు పోతీఫరు ఇంటిలో బానిసగా ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ యోసేపు తో ఉండేవారు. దేవుడు బానిసైన యోసేపును దేశమును పరిపాలించే అధిపతిగా మార్చాలి అని ప్రణాళికను కలిగి ఉన్నారు. పందెము లేకుండా పథకమును పొందలేము కదా అందుకే పరిశుద్ధత పై ఒక శోధనను నియమించి ఉన్నారు. అది చాలా కఠినమైన శోధన వాటిలో ఒకటి సులభముగా శోధింపబడిన యవ్వనం. మరి ఒకటి గొప్ప స్థానము నుండి వచ్చే పిలుపు. కానీ యోసేపు ఆ శోధనను జయించాడు కారణం ఏమిటి అంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితం. కానీ కొన్ని అబద్ధ సాక్ష్యాలు, జైలు జీవితం, నమ్మకద్రోహం ఎదురుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఫలితం దేశమును పరిపాలించే ఉన్నతమైన బాధ్యత. 

 

ప్రియమైన యవ్వనులారా! ఈ పాపపు శోధన అనేది రక్షణ లేని సమయంలో తొందరగా పడగొట్టబడేది. దానికి దావీదు లొంగిపోయాడు యోసేపు మాత్రం ధైర్యముగా నిలబడ్డాడు. మొదట ఈ శోధనకు చోటు ఇచ్చినట్లయితే పాపమును ఎదిరించే శక్తిని కోల్పోతాము. ఒక్కసారి ఒక పాపము చేస్తే దానిని మరల చేయడం అనేది చాలా సులభం కాబట్టి మనలను చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. సరే ఈ పాప శోధనను తప్పించుకొనుటకు కొన్ని సలహాలను చూద్దాం. 

 

1. పరిశుద్ధ గ్రంథమును ఆశ్రయించండి. మూత వేయబడి ఉన్న బైబిల్ మనలను హెచ్చరించదు కాబట్టి ప్రతిరోజు బైబిల్ ని తెరిచి చదివి హెచ్చరికను బుద్దిని మరియు ప్రోత్సాహాన్ని పొందుకొనండి. 

 

2. ఏకాంతాన్ని నివారించండి. ఒంటరిగా ఉన్న గొర్రె నక్కకు ఆహారం అవుతుంది. అగ్ని నుండి తీసిన కర్ర త్వరగా ఆరిపోతుంది. కాబట్టి దేవునితో, సంఘ ఐక్యతతో మంచి స్నేహితులతో కలిసి ఉండండి. 

 

3. సోమరితనాన్ని వదిలేయండి. సోమరితనము హృదయపూర్వక స్నేహబంధం అన్నారు ఒక ఆయన. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన పనిని పూర్ణ మనసుతో ఆసక్తిగా చురుకుగా చేయండి. 

 

అవును ఆలోచనలలో కట్టబడి ఉన్నా అనవసరమైన వాటి నియంత్రించి పాపపు శోధనలను అధిగమించుటకు ప్రార్థించి వాడబారని జీవ కిరీటాన్ని పొందుకుందాం హల్లెలూయ

- సహోదరి. క్రిష్టి గారు 

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీవీ ఆటంకం లేకుండా ప్రతి చానల్లో ప్రసారము చేయబడి లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)