Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.05.2023

దిన ధ్యానము(Telugu) 06.05.2023

 

అంశం: విరిగిన హృదయం

 

"ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి" - కీర్తనలు 46:10

 

ఆధునిక మిషనరీల పితామహుడు అని పేరు పొందిన విలియం కేరి జీవితంలో ఒకరోజు మధ్యాహ్నం అతని యొక్క అచ్చు యంత్రము ఉన్న స్టోర్ రూమ్ లో మంటలు ప్రారంభమయ్యాయి. అచ్చు యంత్రాలన్నీ కూడా కాలిపోయాయి. ఊహించని సంఘటనను అతను తట్టుకోలేకపోయాడు. అతని హృదయము పగిలిపోయింది. విలియం కేరి అద్భుతమైన అనువాదకుడు. పూర్తి బైబులను 20 భాషలలో, నూతన నిబంధనను 40 భాషలలో అనువదించారు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని భాగాలను12 పైగా భారతీయ భాషలలో అనువదించారు. ఇలా అనువదించిన అనేక ముఖ్యమైన గ్రంథపు చుట్టలు ఆ స్టోర్ రూమ్ లో ఉంచారు. ఇది ఒకటి రెండు రోజుల ప్రయత్నం కాదు చాలా సంవత్సరాలు రాత్రి పగలు మెలకువగా ఉండి చేసిన కఠినమైన ఫలితాలు. ఆనాడు తను రాసినవన్నీ కంప్యూటర్ లో దాయడానికి అలానే దానిని అచ్చు వేయడానికి జెరాక్స్ సౌకర్యం కూడా లేదు. చక్కగా రాసి వరుసగా ఉంచిన ముఖ్యమైన గ్రంథపు చుట్టలు అన్ని రెండు గంటలలో బూడిద అయిపోయాయి. ఎంతటి నష్టం కానీ అతను దేవుని సన్నిధిలో నిశ్శబ్దముగా కూర్చుని మరల పనులన్నిటిని చేశాడు. 

 

కీర్తనలు 46:10 లో ఊరకుండుడి నేనే దేవుడును అని తెలుసుకొనుడి అని చదువుతున్నాం. కావున మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. మనము ఆయన సన్నిధిలో కూర్చుని వేచి ఉంటే మాత్రమే ఒక పని యొక్క లోతు తెలుసుకొనగలము. ఆ కీర్తనలలు క్రమముగా చదివినప్పుడు ఎంతటి పెద్ద నష్టాలు, భయాలు, ఆపదలు మనలను చుట్టినను మనము ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు సమస్తమును ఎదుర్కునే హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు అని వాక్యం చెబుతుంది. 

 

అవును ప్రియమైన వారలారా! మనము పూర్తిగా అలసిపోకుండా దేవుని హస్తాలలో కాపాడబడుతున్నాం. సమస్తమును పరిపాలించే దేవుని దైవత్వం లో జ్ఞానమును మనము ఆలోచించి చూసినట్లయితే దేవుని యొద్ద నుండి ఓదార్పును మనం పొందవచ్చును. దేవుడు మనకు చేయవలసిన సమస్తమైన కార్యములను మనం ఊరుకుంటూ అంగీకరించే వారి వలె ఉండాలి. విలియం కేరి యొక్క స్ఫూర్తి మన అందరిని ఉత్సాహపరచును గాక! శ్రేయస్కరమైన సమయంలో మనసారా దేవుని స్తుతించడం చాలా సులభం కానీ అపజయంలో, వ్యాధులలో, బాధలలో, అప్పులలో, కన్నీటి సమయంలో కూడా ఆయనయందు విశ్వాసముంచి ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయ! 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం: 

ఒక గ్రామంలో వీ.బి.ఎస్ జరిగించుటకు 5000 రూపాయలు ఇచ్చి సహాయం చేసే వారు లేచులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)