Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 05.05.2023

దిన ధ్యానము(Telugu) 05.05.2023

 

అంశం: 3A పద్దతి. 

 

"కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు" - ఆదికాండము 2:24

 

కుటుంబం అనేది ఆదిలో దేవుడు మానవునికి ఇచ్చిన అద్భుతమైన వ్యవస్థ. ఇందులో భార్యాభర్తలు దేవుడు నియమించిన ఒక బంధం. ఈనాడు తల్లిదండ్రులచే జరిగిన వివాహాలు కూడా కొన్ని విడాకులతో ముగుస్తు ఉన్నాయి. ఇందులో అనేక కారణాలు ఉన్నప్పటికీ మొదటి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం. ఇంకా భార్యాభర్తల బంధం బలపడడానికి A అనే అక్షరంతో ప్రారంభమయ్యే మూడు పదాల అర్థమును చూద్దాం. 

 

1. (Accept) అంగీకరించుట

మొదట నీ జీవిత భాగస్వామిని ఉన్న స్థితిలో అంగీకరించండి. ఆమె లేదా అతడిని ఆ వ్యక్తిలా లేరు అని ఎవరితో పోల్చవద్దు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక లోటు ఉంటుంది. లోటు లేని భార్యాభర్తలు అని ఎవరిని అనలేము. మీ జీవిత భాగస్వామి ఏ తప్పు చేయకూడదు అని ఆశించినట్లయితే అసంతృప్తి చెందుతారు. ఆశలని విడిచిపెట్టి నేను మంచి భాగస్వామిగా ఉండుటకు ప్రయత్నిస్తాను అని నిర్ణయించుకొనండి. 

 

2. (Adjust) సర్దుబాటు

మీ జీవిత భాగస్వామి యొక్క అలవాట్లు మీకు ఇష్టమైనట్లు మారాలి అని వారికి సలహాలు ఇవ్వకుండా వారి ప్రవర్తనకు తగిన విధముగా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకొనండి. అదే కుటుంబంలో మంచి బంధమును నియమించి బలపరిచే పునాది. 

 

3. (Appreciate) అభినందించుట

భోజనం చాలా బాగుంది అని భార్యతో చెప్పినప్పుడు ఆమె తర్వాత వంట చేసినప్పుడు ఇంకా రుచికరముగా చేయాలని ఆశపడుతుంది. మీ భర్త యొక్క శ్రమను అభినందించినప్పుడు అతడు ఇంకా సంతోషంగా శ్రమించాలి అని ఆశపడతాడు. వారి యొక్క పనులను మీరు అర్థం చేసుకుంటున్నారు అని మనస్సృప్తి కూడా పొందుకుంటారు. ఇలా ఒకరికొకరు అభినందించుకోవడం అనేది ప్రేమలో ఒక భాగం. మీరు మీ జీవిత భాగస్వామిని అభినందిస్తూ ప్రేమించినట్లయితే వారిలో గొప్ప మార్పును చూడవచ్చు. తప్పులను వెతకడం లోటులను ఎత్తిచూపడం వంటివి మీ జీవిత భాగస్వామిని మార్చవు కానీ అభినందనలు కచ్చితంగా మార్చుతాయి. 

 

పైన చదివిన వాటిని మీరు మీ జీవితంలో అమలు చేసినప్పుడు ఇద్దరు యొక్క ప్రేమ బంధం బలపడుతుంది. కుటుంబ బంధం కూడా గొప్పది అవుతుంది. హల్లెలూయ! 

- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్ గారు 

 

ప్రార్థన అంశం: 

వి. బి. ఎస్ పరిచర్యల ద్వారా సందింపబడుతున్న పిల్లల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)