Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 28.03.2023

దిన ధ్యానము(Telugu) 28.03.2023

 

అంశం: హేరోదియా

 

"వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను" - మత్తయి 14:11

 

మనము వెంబడించకుడని ఒక ఉదాహరణ హేరోదియా. హేరోదియా యొక్క జీవితము ఏ ఒక్కరు కూడా వెంబడించకూడని జీవితం. తల్లి వలె బిడ్డ, దారం వలే చీర అనే ఒక సామెత కలదు. అదేవిధంగా హేరోదియా వలె తన కుమార్తె కూడా కఠినమైన మనస్సు కలిగినది. తన పేరు సలోమి అని తనకు అప్పుడు ఇంచుమించు 14 సంవత్సరాల వయస్సు అని చారిత్రిక పరిశోధకులు బ్లెమిస్ జోసఫ్స్ చెప్పారు. 

 

ఇంత వయస్సు ఉన్న ఆ కుమార్తె తన తల్లి ఇచ్చిన సలహాను తిరస్కరించవచ్చు బదులుగా ఆ కుమార్తె తన తల్లి వలె క్రూరమైన గుణమును కలిగి ఉండడానికి హేరోదియాయే కారణమైన ఉంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో పెరగడం వలన తప్పు అంటే ఏమిటో తెలియకుండా పోయింది భయము లేకుండా కోపములో ఎక్కువగా పెరిగింది. ఆమె తన నాట్యమునకు బహుమతిగా తల్లి యొక్క ప్రేరేపణ ద్వారా యోహాను యొక్క తలను అడిగింది. పళ్ళెంలో పెట్టి తనకు ఇవ్వబడిన యోహాను యొక్క తల నుండి రక్తం కారుతున్నప్పటికీ భయం లేకుండా తీసుకుని వెళ్లి తన తల్లికిచ్చింది. ఒకరి యొక్క క్రమశిక్షణ లేని జీవితం వారిని మాత్రమే కాదు వారి సంతతిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అనే వాక్యమునకు తగిన హేరోదియా జోసఫ్స్ యొక్క అధ్యయన ప్రకారము దక్షిణ ఫ్రాన్స్ లోని వియన్నా లోని ప్రవాసములోని మరణించింది. 

 

మన యొక్క జీవితమును ఒకసారి వెనుతిరిగి చూద్దాం. హెరోదియా జీవితం వలె ధైర్యముగా పాపము చేయడము మరియు పగ తీర్చుకోవడం అనే లక్షణాలు మనలో ఉన్నాయా లేదా పౌలు వలె నన్ను వెంబడించుడి అని ధైర్యముగా చెప్పగలిగే వారి వలె ఉన్నామా? మనము లోకమునకు వెలుగునిచ్చే వారి వలె జీవించనప్పటికీ మన కుటుంబమునకు, మన సంతతికి అయినా వెలుగునిచ్చే వారి వలె మారుద్దాం. ఇతరులు వెంబడించే విధముగా జీవించుటకు ఆశపడదాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆమెన్! 

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం: 

ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో జరుగుతున్న డేకేర్ సెంటర్ మినిస్ట్రీ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)