Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 25.03.2023

దిన ధ్యానము(Telugu) 25.03.2023

 

అంశం: ఆశీర్వాదకరమైన కన్నీరు

 

"యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను" - యెషయా 38:5

 

ఇశ్రాయేలీయులను హిజ్కియా రాజు ఎలా నారంభించెను. అతడు దేవుడు కోరుకున్న విధముగా పరిపాలించాడు. యెహోవా యందు విశ్వాసం గలవాడు కాబట్టి దేవుడు అతనిని ఆశీర్వదించారు. ఊహించని విధముగా అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అతను మరణపు అంచుల్లోనికి వెళ్లిపోయాడు. అప్పుడు యెహోవా యెషయా ప్రవక్త ద్వారా నీవు మరణమవుచున్నావు బ్రతుకువ గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని వార్తను పంపించారు. దానిని విన్న హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తన మనసులో ఉన్న సంఘటనన్నిటిని పూర్తిగా దేవుని వద్ద చెప్పాడు. తాను దేవుని దృష్టికి యదార్ధ హృదయుడునై సత్యముతో నడుచుకున్న విధమును ప్రార్థన చేస్తూ చెప్పాడు..హిజ్కియా కన్నీటి ప్రార్థన విని యెహోవా అతనిని కనికరించారు. మరల దేవుడు యెషయా ప్రవక్తను పిలిచి ఈ శుభవార్తను చెప్పమని హిజ్కియా రాజు వద్దకు పంపించారు. దేవుడు హిజ్కియాను బాగు చేసి 15 సంవత్సరములు ఆయుష్షు పెంచారు. అది మాత్రమే కాదు నిన్ను ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండా విడిపించెదను అని వాగ్దానం చేశారు. దేవుని యొద్ద నుండి ఒక సూచనను పొందుకున్నారు. 

 

అవును హృదయ వేదనలో నుండి విడుదల పొందుకున్న రాజన్న హిజ్కియా యొక్క కన్నీళ్లు ఆశీర్వాదకరమైన మార్పునకు కారణమయ్యాయి. అతనిని మరణము నుండి కాపాడాయి. ఆయుష్షును పెంచాయి. పట్టణంలో సంరక్షణ కలిగించాయి. దేవుని యొద్ద నుండి ఒక సూచనను పొందేలా చేశాయి. ఈరోజు మనము కూడా మన జీవితంలో వచ్చే సమస్యలను పోరాటాలను దేవునితో చెప్పి యదార్ధ హృదయంతో కన్నీళ్లు విడిచి ప్రార్ధించినట్లయితే నిశ్చయముగా దేవుడు పరిస్థితులను మారుస్తారు. దుఃఖముతో నిండిన కన్నీరు ఆశీర్వాదకరమైన మార్పును తీసుకొని వస్తుంది. 

 

అవును ప్రియమైన వారలారా! కన్నీరు అనే తాళపు చెవితో ముయబడి ఉన్న ఏ తలుపునైనా తెరవగలము. కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడి ఉన్న గర్భములు కూడా ఆశీర్వాదకరముగా మారుతాయి. ఎడారిలో నీటి బుగ్గలు ఏర్పడతాయి. అందుకు ఉదాహరణ హన్నా మరియు హాగరు యొక్క ప్రార్ధనలు. మీ కన్నీటికి కూడా నిశ్చయముగా జవాబు కలదు. అది పరలోకపు లెక్కల్లో ఉన్నది. అది ఒక బుడ్డిలో సెకరించబడి ఉన్నది. అన్నింటికీ పైగా మన దేవుడు కన్నీటిని చూసే దేవుడు కదా కాబట్టి నీ కన్నీటికి ఆశీర్వాదకరమైన జవాబు కలదు. కలత చెందవద్దు. హల్లెలూయ! 

- బ్రదర్. కె. ఎం. ప్రశాంత్ గారు 

 

ప్రార్థన అంశం:

మన సేవా స్థలంలో జరుగుచున్న గృహ కూడికలలో అనేకులు నూతనముగా పాల్గొనులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)