Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 24.03.2023

దిన ధ్యానము(Telugu) 24.03.2023

 

అంశం: శతాధిపతి

 

"ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను" - 1 కోరింథీయులకు 10:24

 

మత్తయి సువార్త 8వ అధ్యాయము5-13 వచనాలలో మనము చూసిన శతాధిపతి ఒక రోమా శతాధిపతి. యేసుక్రీస్తు ఈయనను ప్రశంసించినంతగా ఇతనిలో ఎన్నో మంచి లక్షణాలు కనిపించాయి. వాటిని గూర్చి ఆలోచించి ఆ మంచి లక్షణాలు మనలో లోపించినట్లయితే వాటిని పొందుకొనుటకు ప్రయత్నిద్దామా? 

 

1. దాసుని పై బాధ్యత:

 సమాజంలో ముఖ్యమైన హోదా కలిగి ఉన్న ఈ శతాధిపతి ప్రభుత్వాధిపతిగా ఉన్నాడు. అనేకమంది ఇతని యొక్క ఆజ్ఞలకు లోబడతారు. ఇంతటి అధికారము, హోదా కలిగి ఉన్న ఈ శతాధిపతి తన వద్ద పనిచేసే దాసుని పైన బాధ్యత కలిగి ఉన్నారు. తన దగ్గర పనిచేస్తున్న దాసుని యొక్క క్షేమము కొరకు జాగ్రత్త వహించాడు. అందువలననే యేసుక్రీస్తు కపెర్నహూముకు వస్తున్నారు అనే వినిన వెంటనే ఆయన వద్దకు వెళ్లి తన దాసుని యొక్క స్వస్థత కొరకు వేడుకున్నాడు. తన జీవితంలో, కుటుంబంలో గల స్థితిగతులను గూర్చి యేసుప్రభు యొద్ద వేడుకొనుటకు అనేక విషయాలు ఉండి ఉండవచ్చు కానీ వాటి అన్నింటినీ పక్కనపెట్టి స్వార్థం లేని వాడిగా నడుచుకున్నాడు. 

 

2. తన్ను తాను తగ్గించుకున్నాడు:

 తన దాసుని స్వస్థపరచుటకు తన ఇంటికి రావడానికి సిద్ధపడుతున్న యేసుక్రీస్తు ప్రభువుతో ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రమే సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అన్నాడు. శతాధిపతి తన దాసుని కొరకు కూడా భారము కలిగి ఉన్న అతను ఖచ్చితముగా సమాజంలో మంచి వ్యక్తిగా ఉంటాడు. కానీ తన మనసులో నేను లోటు కలవాడును నేను పాపి అని స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. సాధారణంగా మనిషిని యొక్క స్వభావం ఏమిటంటే ప్రసిద్ధి చెందిన ఒక సేవకుడు లేదా ప్రసిద్ధి చెందిన ఎవరైనా వస్తాను అంటే మనం ఎప్పుడూ వారిని తిరస్కరించుము. కారణం ఈయన మా ఇంటికి వచ్చారు ఈయన మా కుటుంబమునకు చాలా దగ్గర వాడు అని అనేకులకు చెప్పడంలో మనకు చాలా ఆసక్తి. కానీ శతాధిపతి మాత్రము మన వలె కాదు తన్ను తాను తగ్గించుకున్నాడు. 

 

ప్రియమైన వారలారా! మన కింద ఉండే వారిని లేదా మన ఇంట్లో పని చేసే వారిని మనము జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా నీకు ఆరోగ్యం బాగాలేదా అయినా పరవాలేదు నీవు మొదటి నా పని పూర్తి చేసి వెళ్లి పడుకో అని చెప్పే వారి వలె ఉన్నామా? తర్వాత మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఇతరులు మనలను పొగిడితే మనం చాలా మంచి వారం అనుకుంటున్నామా లేదా యేసయ్య దృష్టిలో నా హృదయము ఎలా ఉంది అనే విషయాన్ని ఎరిగి మనలను తగ్గించుకుంటున్నామా ఆలోచిద్దాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు. 

 

ప్రార్థన అంశం:

ప్రతి సోమవారం రాత్రి జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమ కరముగా కార్యము జరిగించులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)