దిన ధ్యానము(Telugu) 23.03.2023
దిన ధ్యానము(Telugu) 23.03.2023
అంశం: శక్తి కొలది చేయుడి
"చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము" - ప్రసంగి 9:10
ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్లిన ఒక సేవకుడు తను నడిపించిన ఒక వృద్ధురాలు ఎలా రక్షింపబడ్డారు మరియు ఆమె ఎలా పరిచర్య చేశారు అని రాసిన సాక్ష్యం నన్ను మిక్కిలి కదిలిచివేసింది
ఆ స్త్రీకి కళ్ళు కనబడవు కాబట్టి చదువుట, రాయుట ఆమెకు రాదు. అయినప్పటికీ తాను తెలుసుకున్న యేసయ్యను అందరికీ పరిచయం చేయాలని కోరిక ఉండేది ఆమెకు. కాబట్టి తనకు యేసయ్య గురించి చెప్పిన ఆ మిషనరీ వద్దకు వెళ్లి ఫ్రెంచ్ బైబిల్ ఒకటి తీసుకుంది ఆమె. దానిని తీసుకున్నప్పుడు ఆ బైబిల్ లో గల యోహాను 3:16 వాక్యాన్ని ఎర్ర ఇంకుతొ అండర్లైన్ చేసి ఇమ్మని అడిగింది. తర్వాత ఆమె ఆ పేజీ సులువుగా తీసుకొనునట్లు గుర్తుపెట్టుకోంది. చదువురాని కళ్ళు కనబడని ఆ వృద్ధురాలు ఫ్రెంచ్ బైబిల్ ని పట్టుకొని ఏమి చేయబోతుందో అని తెలుసుకొనుటకు ఆ మిషనరీ ఆమె వెంబడి వెళ్లారు. ఆ ఊరిలో గల ఒక బడి వద్దకు వెళ్లి పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి సరిగా ఆమె నిలబడింది. తర్వాత ఆ మార్గంలో వస్తున్న ఒక విద్యార్థిని పిలిచి నీకు ఫ్రెంచ్ చదవడం వచ్చా అని అడిగింది వచ్చు అని సమాధానం ఇచ్చాడు ఆ విద్యార్థి. వెంటనే ఆ విద్యార్థి చేతికి ఆ బైబిల్ ఇచ్చి ఎరుపు రంగుతో అండర్లైన్ చేసిన వాక్యాన్ని చదవమని చెప్పింది. తర్వాత ఆ వాక్యానికి గల అర్థం కూడా తాను చెప్పింది. ఇలా సోలిపోకుండా తరచుగా చేసి 25 మంది బోధకులను ఆమె తయారు చేసింది. ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి కొరకు ప్రభువు పైన నేరం మోపుతున్న ప్రజల మధ్యలో ఈ స్త్రీ జీవితం మనకు ఒక కొరడా దెబ్బ వంటిదే.
మనము అనేక సమయాల్లో ఇలా ఆలోచిస్తూ ఉంటాం. వారివలె నాకు పరిచర్య చేయడం రాలేదు. వీరి వలె ప్రసంగించలేకపోతున్నాను అని ఆలోచించవచ్చు. బైబిల్ లో ఒక మాట రాయబడి ఉంది ఆమె తన శక్తి కొలది చేసింది అని. మనం ప్రతి ఒక్కరము దేనిని చేయగలమో దాన్ని చేయుటకు పిలవబడుతున్నాం. పైన చెప్పబడిన సంఘటనలో కనులు కనబడకపోయినప్పటికీ తన ఎడతెగని ప్రయాసతో, ప్రార్థనలతో అనేకమంది వ్యక్తులను దేవుని యొద్దకు నడిపించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా మీరు ఏది చేయగలరో దానిని విశ్వాసముతో చేయడం ప్రారంభించండి. ఆ అల్పమైన ప్రారంభము గొప్ప ప్రభావాన్ని చేయగలదు.
- బ్రదర్. ఎస్ భాస్కర్ రూబన్ గారు.
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో గల హాస్పటల్ కి అవసరమైన ఉపకరణములను కొనుటకు కావలసిన ధన సహాయము అందేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250