Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 17.03.2023

దిన ధ్యానము(Telugu) 17.03.2023

 

అంశం: అనుసరించుము

 

"విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును" - మత్తయి 19:29 

 

ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి తనకు అన్నీ తెలుసు అని గర్వముగా చెప్పుకుంటూ ఉపాధ్యాయులను విమర్శిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని చూసి బ్లాక్ బోర్డ్ మీద 1000 అనే సంఖ్యను రాసి చదవమన్నాడు ఆ విద్యార్థులు లేచి ఒక వెయ్యి అని చదివాడు. మరల ఇంకొక సున్నా చేర్చి ఇది ఎంత అని అడిగారు ఆ ఉపాధ్యాయులు దానికి అతను పదివేలు అన్నాడు. మరలా ఒక సున్నాను ఒకటికి ముందు రాసి ఇప్పుడు చదువు అన్నారు ఆ విద్యార్థి పదివేలే అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే తక్కువ విలువ గల సంఖ్యను గణనీయ సంఖ్య వెనుక వస్తే దాని విలువ పెరుగుతుంది అదే సంఖ్య ముందుగానే వస్తే దానికి విలువే ఉండదు కాబట్టి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి యొక్క బంధము ఇట్టిదే అని అన్నారు ఆ ఉపాధ్యాయుడు. 

 

ఇదే విధముగా మన్ను అయిన మనము కూడా సర్వశక్తిమంతుని వెంబడిస్తే మన విలువ పెరుగుతుంది. పేతురు ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిని గనుక మాకు ఏమీ దొరుకునని అడిగినప్పుడు నన్ను వెంబడించిన మీరు నాతోపాటు సింహాసనం పైన ఆసీనులైందురు. అదియుగాక నిత్యజీవమును స్వతంత్రించుకొందురు అని అన్నారు యేసుక్రీస్తు. కానీ లూసిఫర్ దేవుని కంటే ముందుగా ఉండాలి అనుకున్నాడు కాబట్టి పరలోకం నుండి త్రోసి వేయబడ్డాడు. మనం ఇంకా ప్రభువైన యేసును వెంబడించినప్పుడు నిత్యజీవమును స్వతంత్రించుకుంటాము. నూరు రెట్లు ప్రతిఫలమును పొందుకుంటాము. లోకమునకు వెలుగు అయిన ఆయనను మనం వెంబడించినప్పుడు సూర్యుని నుండి కాంతిని అందించే వారి వలె ఉంటాము. మన వెలుగు వద్దకు జనములను మన ఉదయ కాంతి వద్దకు రాజులను వచ్చేదురు. అందుకొరకు మనము చేయవలసింది ఒకే ఒక్కటి క్రీస్తును మన ముందు ఉంచి మనము ఆయన వెనక వెళ్లడం. నాకు అన్నీ తెలుసు ఇది నా యొక్క సామర్థ్యం అని క్రీస్తుని వెనక పెట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. 

 

ప్రియమైన వారలారా! మీ జీవితం ఎలా ఉంది కాంతివంతముగా విలువగలిగినదిగా ఉన్నదా? కారణం క్రీస్తు మిమ్మును చేర్చు కొనుటయే. దేవుడు మీ కుడి పక్కన ఉండడం వల్లనే అనే విషయాన్ని మర్చిపోవద్దు. చీకటిగా విలువ లేనిదిగా మీ జీవితం ఉన్నట్లయితే ఈ రోజే రక్షకుడైన యేసయ్యను మీ ముందు ఉంచి ఆయన వెనుక మీరు వెళ్ళండి. మీ జీవితం కాంతివంతముగా మారుతుంది. నూరు రెట్లు ప్రతి ఫలముతో నిత్యజీవమును పొందుకుంటారు. హల్లెలూయ! 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం: 

విద్యార్థుల మధ్య జరుగుతున్న స్కూల్ మిషన్ పరిచర్య ద్వారా అనేక మంది చిన్న పిల్లలు దేవుని ప్రేమ ను రుచిచూచులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)