Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 30.01.2023

దిన ధ్యానము(Telugu) 30.01.2023

 

అంశం:- రెండు కాసులు

 

"వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను" - మార్కు 12:44

 

దేవునికి ఇచ్చుట అన్నది చాలా శ్రేష్టమైన కార్యం. ఇది దేవుడు మనకు నేర్పించిన కార్యం. ఆయన భూమిని మరియు దానిలో గల సమస్తమును సృష్టించి వాటిని మనిషి చేతికి అప్పగించి పరిపాలించమని సంతోషముతో అప్పగించారు. దానిలో నుండి మనము ఆయనకు ఇచ్చే కానుకను చూచి సంతోషిస్తున్నారు. 

 

ఈ దినము మనము ధ్యానం చేసే స్త్రీ వృద్ధాప్యంలో గల ఒక పేద విధవరాలు. ఆ దినములలో అలాంటి వారిని సంఘమే బాధ్యత తీసుకొని పరామర్శిస్తూ వచ్చేది. ఈ పేద విధవరాలు కూడా సంగం ఇచ్చే చిన్న ధనముతోనే తన జీవితాన్ని నడిపిస్తూ వచ్చి ఉండేదేమో ఇలాంటి పరిస్థితుల్లో ఈమె వలన వేయబడిన కానుక యేసయ్య గమనించేటట్లు చేసింది. ఆ స్త్రీ వేసిన రెండు కాసులు అనేది ఆ దినములలో చాలా అల్పమైన మొత్తం అయినప్పటికీ దానిని మిక్కిలి సంతోషముతో ఇచ్చారు. తన వద్ద ఉన్న సమస్తాన్ని దేవుని కొరకు సమర్పించారు. ఎందుకంటే దేవుని మీద ఆమెకు సంపూర్ణ విశ్వాసం ఉండేది. ప్రభువు ఇంతవరకు తనను కృపతో పోషిస్తూ వచ్చిన దానిని అనుభవ పూర్వకముగా గ్రహించి ఉన్నారు. 

 

యేసుక్రీస్తు ప్రభువు ఆమె వేసిన మొత్తాన్ని ఎంత వేసిందో అని చూడలేదు ఆమె అంతరంగంలో గల ఆలోచనలు చూశారు. అనేకమంది ధనవంతులు దీని కంటే ఎక్కువగా వేసిన దానిని యేసు క్రీస్తు ప్రభువు గమనిస్తూ ఉన్నారు. వారందరూ వారికి కలిగిన సంపూర్ణములో నుండి వారు ఇచ్చారు. ఈమె అయితే తన జీవనమంతయు ఇచ్చి వేశారు అని యేసుప్రభు చెబుతున్నారు. తనను ఆదుకునే సంఘమును తాను ఆదుకోవాలి అని ఆమె కోరుకున్నారు. ఇది ఎంత నిస్వార్ధమైన కార్యము చూశారా? మన యొద్ద ఉన్న చిన్న కార్యాల ద్వారా దేవున్నీ మనము మహిమ పరచగలం అనేదానికి ఇది మంచి ఉదాహరణ. 

 

ప్రియమైన వారులారా ఇది నాది నా జీవితానికి సహాయపడుతుంది, నా అవసరతలకు పనికి వస్తుంది అని ఆ విధవరాలు ఆలోచించి ఉండిన దాంట్లో తప్పు లేదు. అయినను ఆమె తనకంటూ ఏమి దాచుకోకుండా రేపటికి ఏమి చేస్తాము అని ఆలోచించకుండా నిస్వార్థముతో ఇచ్చారు. ఆ చిన్న కానుకను ప్రభువు దృష్టిలో పెద్ద మొత్తముగా చూడగలిగారు. ఆయన కొరకు ఇచ్చిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టరు. పేద విధవరాలు అయినా ఆ తల్లి తన వద్ద ఉన్న అంతటినీ ప్రభువు కొరకు ఇచ్చినప్పుడు మరి మనము కూడా మనకు కలిగిన అంతటినీ ప్రభువుకు ఇవ్వవచ్చు కదా! నాకు ఒక తల్లి తెలుసు. ఈమె దేవుని కొరకు ఏదన్న ఇవ్వాలని ఆశించారు. ఈమె తన భర్తకు తెలియకుండానే ఇవ్వగలరు. హాస్పిటల్ ఖర్చుకు అని భర్త ఇచ్చిన ధనమును పరిచర్యకు ఇచ్చి తాను ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేవారు ఇదే ఆమె చేయగలిగినది. 

- బ్రదర్ కె.ఎం ప్రసాద్. 

 

ప్రార్థన అంశం:

నూతనముగా కట్టబడుతున్న హాస్పిటల్ కు అనుభవం గల మరియు సమర్పణ గల వైద్యులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)