Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 29.01.2023 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 29.01.2023 (Kids Special)

 

అంశం:- స్కూల్ విజన్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును" - కీర్తనలు 119:16

 

నోట్స్ తీసి టెస్ట్ రాయండి అని చెబుతూ క్లాస్ లోనికి వచ్చారు ఇంగ్లీష్ టీచర్. ప్లీజ్ సార్ రేపు పెట్టండి అని విద్యార్థులు అందరూ ఏక స్వరముతో చెప్పుట విని సరే సరే పుస్తకాన్ని తీసి చదవండి ఇకమీదట చెప్పిన వెంటనే పరీక్షకు సిద్ధం కండి అని చెప్పారు మాస్టారు. మంచిది తప్పించుకున్నాం అని ఆలోచించి పిల్లలందరూ కూడా పుస్తకము తీసి చదవడం ప్రారంభించారు. ఏంటి పిల్లలు టెస్ట్ అంటే అందరికీ భయమా ప్రతిరోజు హోంవర్క్ చేసేస్తే భయపడవలసిన అవసరం లేదు అంతే కదా పిల్లలు. ఆ స్కూల్లో లంచ్ టైంలో సెల్వి అక్క బైబిల్ కథలు చెప్పడానికి వస్తూ ఉంటారు. పాటలు, కథలు, వాక్యాలు, మ్యాజిక్ అన్ని చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఇది ధనలక్ష్మి అనే అమ్మాయికి ఎంత మాత్రం నచ్చదు. యేసయ్య గొప్పవాడా అని హేళన చేస్తూ ఉండేది. అక్క నేర్పించినవి ఏవి కూడా వినకుండా చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్నవాళ్లను కూడా సరిగా వినకుండా చేసేది. ధనలక్ష్మి చేసిన దాన్ని చూసి సెల్వి అక్క మనసులో బాధ ఉన్నప్పటికీ సహనముతో క్లాసులు పూర్తి చేసింది. అక్క నిన్న నేర్పించిన వాక్యాన్ని ఎవరు చెప్తారు అని అడిగిన వెంటనే అక్క నేను నేను అని అందరూ వరుసగా చేతులు ఎత్తడం ప్రారంభించారు. అరుణ్ లేచి వాక్యాన్ని చెప్పగానే అందరూ చక్కగా చప్పట్లు కొట్టారు. ఎప్పుడు తడబడుతు మాట్లాడుతూ ఉండే అరుణ్ ఏమాత్రం కష్టపడకుండా తడబడకుండా ఆరోజు వాక్యాన్ని చక్కగా చెప్పాడు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది అది మాత్రం కాదు ఆసక్తితో అందరూ వాక్యాన్ని చదవడానికి హేతువైంది. ఆరోజు నుండి అరుణ్ యొక్క మాటలు స్పష్టంగా వచ్చాయి. అద్భుతాలు జరుగుటకు యేసు క్రీస్తు ప్రభువు మాటల ద్వారా మీతో కార్యం చేస్తారు. కాబట్టి అందరూ వాక్యాన్ని కంఠస్థం చేయాలి అని సెల్వి అక్క చెప్పిన వెంటనే ఒకే అక్క అని పిల్లలందరూ కూడా జవాబు చెప్పారు. అల్లరి చేస్తున్న అమ్మాయి ధనలక్ష్మి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనే కదా మీరు నన్ను అడుగుతున్నారు. ధనలక్ష్మి కూడా అందరితోపాటు కలిసి నెమ్మదిగా తన తలను ఊపింది నేను కూడా వాక్యాన్ని కంఠస్థం చేస్తాను అని చెప్పింది. ధనలక్ష్మి యొక్క మార్పు సెల్వి అక్కకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ దినము బైబిల్ క్లాస్ చక్కగా పూర్తి అయినందుకు యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లించింది సెల్వి అక్క. 

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)