Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 28.01.2023

దిన ధ్యానము(Telugu) 28.01.2023

 

అంశం:- పరిగెడుతూ ఉంటాం. 

 

“నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు” - సామెతలు 24:16

 

నేను ఎక్కడ ఆఖరి వరకు నిలబడబోతున్నాను? అనే ఆలోచనే ఈ దినము అనేకులను యేసయ్య శిష్యులుగా మారకుండునట్లు చేస్తుంది. నేను యేసయ్య బిడ్డను అని ధైర్యముతో కుటుంబీకులతో స్నేహితులతో చెప్పిన తర్వాత ఏదైనా పాపంలో పడిపోయిన యెడల వారందరూ నన్ను అపహాస్యము చేస్తారేమో అనే ఆలోచన వాళ్లను క్రీస్తునందు బలమైన వాళ్ళుగా లేనట్టుగా చేస్తుంది.   

 

యేసయ్య నడిచినట్లుగానే మనం కూడా నడుచుకొనవలెను (1యోహాను2:6) అనేది నిజమే. అయినప్పటికీ ఏదైనా కొన్ని సమయాలలో మనం అందరం తడబడుతూనే ఉంటాం అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. కాబట్టి అపోస్తులుడైన యాకోబు మనమందరం అనేక విషయాలలో తప్పిపోతున్నాం (యాకోబు 3:2 ) లో తనను కూడా కలుపుకుంటున్నారు. కాబట్టి తడబడుట అనే దాని గురించి మనము భయపడి నిలిచిపోకుండా తడబడిపోయి పడిపోయిన మనము ఏమి చేయాలి అనేదాన్ని గ్రహించి ఉండాలి. అదేమిటి అంటే వెంటనే లేచి తరచుగా మన పరుగుని కొనసాగించాలి అంతే. దేవుడు మన యొద్ద నుండి దేనిని ఎదురుచూస్తున్నారు అనే కార్యంలో అనేకులు భిన్నమైన అంశాన్ని కలిగి ఉన్నారు. మనము ఆయన యొద్దకు వెళ్ళుటకు ముందు 100% సరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అని మనకు మనమే నిర్ణయించుకుంటున్నాం. కాని నిజం అది కాదు నా , యొద్దకు వచ్చు వారిని ఎన్నడును త్రోసివేయను అని ఇంకను కూడా ఆయన మనలను పిలుస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లినా ఈ అద్భుతమైన వాగ్దానమును మరిచిపోకుడి. 

 

కాబట్టి ప్రియమైన వారలారా పడిపోతా మేము అని ఆలోచించి పరిగెత్తకుండా ఆగిపోకండి. పడిపోయిన చోటనే బలహీనమైన మనసుతో ఉండిపోకుండా ప్రభువు చెంతకు తిరిగి ప్రభువా మీరు నన్ను ఎన్నడూ త్రోసి వేసేవాడు కాదు అని విశ్వసిస్తున్నాను. ఇదిగో మీ యొద్దకు మరలా వస్తున్నాను అని చెప్పి లేచి మీ పరుగుని కొనసాగించండి. దేవుడు మీతో ఉండి చేస్తున్న అద్భుత కార్యాల్ని కనులార మీరే చూస్తారు. 

- బ్రదర్. జకర్యా

 

ప్రార్ధన అంశం:

ప్రతి సోమవారం జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఇంకను అనేకులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)