Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 01.12.2022 (Christmas Special)

దిన ధ్యానము(Telugu) 01.12.2022 (Christmas Special)

 

అంశం:- విశ్వాసమును పెంచే క్రిస్మస్.

 

"ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను" - లూకా 1:45

 

కరిబియన్ సముద్రంలో స్నానం చేసి కాలక్షేపం చేసేందుకు సముద్రంలో లోతైన ప్రాంతం వెతుక్కుంటూ ముగ్గురు వ్యక్తులు పడవ పై వెళ్లారు. ఆ స్థలంలో ముగ్గురు స్నానం చేస్తుండగా వారిలో పెద్దవాడైన ఒకరికి భయం, ఆందోళన కలిగింది. ఇతనికి సహాయం చెయ్యాలి అని వారిలో ఒకరు ఇక్కడకు రండి ఇక్కడ నిలబడటానికి ఇక బండ ఉన్నది అన్నాడు. మొదట నమ్మడానికి నిరాకరించిన ఆ వ్యక్తి తన స్నేహితుడు నిలబడి ఉన్న ప్రదేశాన్ని చూసి అక్కడకు వెళ్ళాడు. ఇప్పుడు ఇతనికి కూడా నిలబడుటకు చోటు దొరికింది. చుట్టూ నీరు అలలు ఉన్నప్పటికీ అతనిలో భయం లేదు. తాను నిలబడుటకు ఒక బండ ఉన్నది అలానే తన మనస్సులో కూడా నమ్మకం ఉన్నది.

 

ఈ సంఘటన ద్వారా మనం పరిశుద్ధ గ్రంధం లోనికి ప్రవేశించ వచ్చు. దర్శనం లేని కాలంలో జకర్య మరియు ఎలీసబెతు అనే వృద్ధ దంపతులు జీవిస్తూ వస్తున్నారు. మాలకి తరువాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అని చెప్పుటను మనం తెలుసుకోవచ్చు. ఎలీసబెతు విషయానికి వస్తే పిల్లలు లేని గొడ్రాలు అని వ్రాయబడి ఉండుట మనం చూస్తున్నాం. ఎలీసబెతు తన జీవితంలో బాధలను, నిందలను అనుభవించింది. అటువంటి బాధాకరమైన సమయంలో దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టారు. ఎడారిలో మార్గాలను బహిరంగ ప్రదేశాల్లో దారులను ఏర్పరుచు దేవుడు ఎలీసబెతు జీవితంలో రెండంతలు సంతోషాన్ని కలుగజేసి ఆశీర్వదించారు. పిల్లలు లేని గొడ్రాలు అని పిలువబడే ఎలీసబెతు గర్భవతి అయ్యింది. రెండవదిగా తన బంధువురాలైన మరియ మూలముగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించబోతున్నాడు అనే వార్త ఎలిసబెతును సంతోషంగా గంతులు వేసే విధంగా చేసింది. 

 

ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్దించెను గనుక నమ్మెను ఆమె ధన్యురాలు అని ఎలిసబెతూ చెబుతోంది. ఎలీసబెతు యొక్క మొదటి క్రిస్మస్ విశ్వాసం అధికం అవుటయు సంతోషం నిండినదిగ ఉంది. 

 

ప్రియమైన వారలారా! ఈ క్రిస్మస్ మీకు మేలును కలుగ జేయించబోతుంది. విశ్వసిస్తున్నారా! విస్తారమైన జలములు చుట్టుముట్టి మధ్యలో మీరు ఉన్నట్లుగా భయాలు, వేదనల మధ్య మీరు ఉన్నారా? మిమ్మును ఆదరించుటకు యేసుక్రీస్తు మీకు తోడైయున్నారు. మీ పాదములు రాయికి తగలకుండా ఆయన మిమ్మును చూసుకుంటారు. విస్తారమైన జలములు మనలను నశింపజేయవు. అనవసరమైన భయం మీలో ఉండకూడదు. క్రీస్తుపై మీ విశ్వాసాన్ని పెంచుకొనండి. క్రిస్మస్ దినాలు మీకు మేలుకరముగా ఉండు లాగున ఎలీసబెతుతో కలిసి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఈనెల అంతా జరగబోయే పరిచర్యలో దేవుని హస్తం తోడైయుండి నడిపించులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)