Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 30.11.2022

దిన ధ్యానము(Telugu) 30.11.2022

 

అంశం:- గుడిసెలో నీవు.

 

"ఇవన్నియు నాకు ప్రతి కూలముగా ఉన్నవని వారితో చెప్పెను" - ఆదికాండము 42:36

 

సముద్రం మద్యలో ఒక ఓడ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని ఒక బండరాయికి తగిలి బద్దలైపోయింది. అందులో ఉన్న ఒక వ్యక్తి ఒక చెక్కను పట్టుకొని మూడు రోజులు తేలుతూ మనుష్యులు లేని ద్వీపమునకు చేరుకొన్నాడు. అక్కడ గుడిసె వేసుకొని జంతువులను వేటాడి తినేవాడు. పగలంతా చెట్టు ఎక్కి ఏదైనా ఓడ వస్తుందేమో అని చూస్తూ నన్ను నా మాతృ భూమికి పంపమని తరుచుగా యేసుక్రీస్తు కు ప్రార్ధించే వాడు. 

 

ఒక రోజు అతను వేటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అతని గుడిసె కాలిపోతుంది. దానిని చూసి అతను చాలా బాధపడ్డాడు.అయితే కొద్ది సేపటిలొనే అతనిని కాపాడుటకు ఒక ఓడ రావడం అతను గమనించాడు. అక్కడికి వచ్చిన నావికుడు నువ్వు ఇంత పెద్ద మంటను వెలిగించడం వలన ఇక్కడ మనుష్యులు ఉంటారు అని వచ్చాము అని చెప్పి అతనిని తీసుకొని వెళ్లిపోయారు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిద్యోను తనకు ప్రత్యేక్షమైన దేవదూతతో యెహోవా మాకు తోడై యుండిన యెడల ఇదంతయు మాకెలా సంభవించెను అన్నాడు. ఈ పరిస్థితి మూలముగా యెహోవా గిద్యోనును ఒక పరాక్రమ వంతునిగా చేసెను.

 

పరిశుద్ధ గ్రంధంలో యాకోబు అనే భక్తుడు దేవునితో పోరాడి గెలిచాడు. కాని తన ప్రియ కుమారుడైన యోసేపును కోల్పోవడం అతనికి భరించలేని దుఃఖం కలుగజేసింది. ఆ తరువాత వచ్చిన కరువులో తనని తన కుటుంబాన్ని రక్షించుటకు దేవుడు ప్రేమతో చేసిన పని అని అతనికి తెలియక అంతా అతనికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపించింది. 

 

ప్రియమైన సహోదరి సహోదరులారా! ఇటువంటి కార్యాలు మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా కనిపిస్తే మనం చెయ్యవలసినది ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసముతో సమస్తము మేలు కొరకే నీవు నడిపిస్తావు అని ప్రార్దించి మన జీవితాన్ని ఆయన చేతుల్లో సమర్పించాలి. జరిగేది అంతా మన చిన్న తెలివికి వ్యతిరేకంగా అనిపించినా బయపడవద్దు. ఓపికతో వేచి యుండి మన పరమతండ్రి యొద్దనుండి మేలులను పొందుకుందాం. ఆమెన్.

- సిస్టర్. ఏ. బ్యూలా గారు

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యలను ప్రార్ధనల ద్వారా కానుకల ద్వారా సహకరిస్తున్న భాగస్వాముల కుటుంబాలను దేవుడు దీవించులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)