Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 27.11.2022 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 27.11.2022 (Kids Special)

 

అంశం:- అల్లరి పక్షులు.

 

“వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు” - యోబు 12: 12

 

హాలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక కథను చెప్పాలి అని మీ ముందుకు వచ్చాను. సరే కధ విందామా? 

 

ఒక దట్టమైన అడవిలో 10 పక్షులు కలిసి మెలిసి జీవిస్తూ ఉన్నాయి. అందులో ఒక పక్షికి మాత్రం బాగా వయస్సు అయిపోయినది మిగిలినవి అన్నీ యువ పక్షులు. యువ పక్షులు అన్నీ ఒక రోజు మనం సాహసాలు చెయ్యాలి అని ఆలోచించాయి. అప్పడు ఆ ముసలి పక్షి మీకు అవసరం లేని చోట ధైర్య సాహసాలు చేస్తే అవి విపత్తుకు దారి తీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. వెంటనే మిగతా పక్షులు అన్నీ అమ్మమ్మకు ఏదో ఒకటి చెప్పి కాలక్షేపం చేస్తుంది. ఒక రోజు అవి అన్నీ కలిసి విశాలమైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. అందులో ఒక పక్షి మాత్రం నేలపైన విప్పి ఉన్న వలను చూసింది. వెంటనే మిగిలిన పక్షులను పిలిచి చూడండి వేటగాడు వల వేసాడు మనం అందరం వెళ్లి ఆ వలను తీసుకొచ్చేద్దామా అని చెప్పింది. అందుకు ఒక పక్షి ఏంటి మనం వలను తీసుకొని రావాలా అని అడిగింది. ఇంకొక పక్షి ఇది కూడా నీకు తెలియదా అప్పటి కాలంలో కొన్ని పక్షులు కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. ఒక రోజు వేటగాడు వేసిన వలలో చిక్కు కున్నాయి. తరువాత అవి అన్నీ కలిసి వలను ఎత్తుకొని ఎగిరిపోయాయి అని చెప్పింది. ఆ వయస్సు అయి పోయిన ముసలి పక్షి వద్దు కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు అని హెచ్చరించింది. వెంటనే ఇంకొక పక్షి మీరు కొద్దిగా సైలెంట్ గా ఉంటారా మీ కాలం అయిపోయింది ఇక పైన మేము చెప్పినదే మీరు వినాలి లేకుంటే ఇంట్లోనే ఉండండి అని చెప్పింది. పక్షులు అన్నీ ఆ వల వైపు ఎగిరి ఆ వలలో చిక్కుకున్నాయి. ఆ ముసలిదైన పక్షి మాత్రం ఇష్టం లేకుండానే ఆ వలలో పడింది. కొంచం సేపటిలో ఒక యవ్వన పక్షి వన్, టు, త్రి అని చెప్పడంతో మిగతా పక్షులు ఎగరడానికి ప్రయత్నం చేసాయి. కాని వల రాకపోవడంతో అవి ఎగరలేక పోయాయి. అంతలో వేటగాడు వచ్చేసాడు పక్షులు అన్నింటిని చూసి ఆనాడు మీ చేతిలో మోసపోయిన వేటగాడి వలె నన్ను మోసం చేద్దాము అనుకున్నారా మీరంతా ఈ రోజు నా చేతుల్లో ఆహారం అయిపోతారు అని ఒక్కొకరిని చంపుతూ చెప్తున్నాడు. అందులో ఒక పక్షి మేము మా అమ్మమ్మ చెప్తున్న మాటలకు మేము లోబడి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు అని చెప్తూ చాలా బాధపడింది. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీరు కూడా మీకు మంచి సలహాలు చెప్పే పెద్దవారికి లోబడకపోతే మీరు కూడా ఇలానే ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. కాబట్టి ఇంట్లో అమ్మమ్మ తాతయ్య మరియు అమ్మ, నాన్న చెప్పే మాటలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. సరేనా ఒకే పిల్లలు ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చు కుందామా! 

- శ్రీమతి . జెస్సి విజయ్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)