Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 19.08.2022

దిన ధ్యానము(Telugu) 19.08.2022

 

అంశం:- బేధము ఏమియు లేదు. 

 

"యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు." - గలతియులకు 3:26

 

జాతిభేదాలు పాటిస్తున్న ఒక గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి, వేరే ఊరిలో ఉంటున్న ఒక చిన్న పాప తనకు సెలవులు ఇవ్వడంతో ఆ ఊరికి వెళ్ళింది. అప్పుడు ఒక తక్కువ జాతికి చెందిన ఒక వ్యక్తి నీళ్ళు అడగడంతో ఆ పాప వాళ్ళ బంధువుడు నీటిని చేయి పై పోసి ఆ పాపను రమ్మని చెప్పి చెంబును ఇచ్చాడు. ఆ పాపకు అది క్రొత్తగా అనిపించింది. తన మనస్సు ఆ పనిని చేయుటకు ఒప్పుకోలేదు కాబట్టి ఆమె ఆ చెంబును ఆ వ్యక్తి కి ఇచ్చి త్రాగమని చెప్పింది. అతను కూడా నీటిని త్రాగి వెళ్ళిపోయాడు. ఆమె బంధువు ఎందుకు ఇలా చేశావ్ అని అడిగాడు అతను కూడా మనలాంటి మనుష్యుడే కదా అందుకే నేను ఇలా చేసాను అని చెప్పింది ఆ పాప. పరిశుద్ధ గ్రంధంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక వ్రాసినప్పుడు, యేసు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు అని వ్రాసాడు. అలా అయితే యేసుక్రీస్తు స్వరూపములో ఉన్న మనమందరం ఐక్యముగా ఉన్నాం మనలో బేధములు ఉండకూడదు. గతకాలంలో గ్రీకులో, రోమీయులు ఆడ, మగ అని ఉండే అనేక విభేధాలను నిషేధించడానికి పౌలు ఈ విధముగా చెబుతున్నాడు. యేసుక్రీస్తు కూడా మన జీవితంలో అన్యజనులు అని చెప్పబడే సమరయుల పట్ల మరియు బహిష్కరించబడినవారి పట్ల ప్రేమను మరియు శ్రద్ధను చూపించారు అని చదువుతున్నాం.

 

ప్రియమైన వారలారా! మనలో ఎంతమంది ఈ చిన్న పాపవలె మనుష్యులందరూ సమానమే ఏ జాతియైన సరే బేదాలు చూడకూడదు. జాతి, రంగు, బాష ఏదైనా అందరిని ప్రేయమించాలి అని ఆలోచనను కలిగిఉన్నాం. పరిశుద్ధ గ్రంధం చూపించే దారిలో నడిచేవారం అని చెప్పుకునే మనం. ఈ జాతి బేధాలను ఏవిధంగా అణచివేస్తున్నాం? ఈనాడు సంఘాలలో జాతిభేదాలు అధికముగా ఉన్నాయి. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఈ భేదం ఇంకా అధికముగా ఉన్నది. క్రీస్తును పోలిన పెండ్లి కుమారుడు లేదా పెండ్లి కూతురిని భాగస్వామిగా వెతికే పరిస్థితి విశ్వాసులు వస్తే సంఘంలో ఒక పునరుజ్జీవనం ఏర్పడు తుంది. ఖచ్చితంగా సంఘము అనేది సమాజానికి దాహమును ఏర్పారుస్తుంది. అవును దేవుడు మన అందరిని తన పోలిక చెప్పున సృష్టించుకున్నారు. ఆయన దృష్టిలో అందరం సమానమే. మనము కూడా యేసుక్రీస్తులో అందరిని ఒకటిగా చూసినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడు కూడా సంతోషిస్తాడు అనే దానిలో సందేహమే లేదు. హల్లేలూయా! 

- శ్రీమతి. ఏంజలిన్

 

ప్రార్థన అంశం:-

మోక్ష ప్రయాణం అనే ఈ దినధ్యాన పత్రిక 8 బాషలలో అనువధించబడుతున్నది. ఈ పత్రికలను యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా అనేకులు చదివి రక్షణ పొందులాగున ప్రార్ధిద్దాం. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)