Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 18.08.2022

దిన ధ్యానము(Telugu) 18.08.2022

 

అంశం:- మనం దొంగలమా?

 

"దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" - ఎఫెసీయులకు 5:15-16

 

నేటి కాలంలో మనం వెళ్తున్న స్థలాల్లో ప్రకృతి అందాలను వీడియో తీసి యూట్యూబ్ లో మరియు ఫేస్ బుక్, వాట్సాప్ లో షేర్ చెయ్యడం అలవాటుగా మారిపోయింది. 80 సంవత్సరాలు నిండిన ఒకాయన సిమ్లా వెళ్ళాలి అని తన స్నేహితులతో కలిసి టికెట్ తీసుకున్నప్పుడు గుండెపోటుతో క్రింద పడిపోయాడు. అతనిని హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా అతని గుండెకు శస్త్ర చికిత్స చేయడానికి 8 లక్షలు అడిగినప్పుడు అతని కళ్ళల్లో నుండి కన్నీరు కారింది. ఎందుకు ఏడుస్తున్నారు అని ఆడిగిన్నప్పుడు అతడు 80 సంవత్సరాలు నా గుండెను ఒక్కరోజు కూడా ఆగకుండా పనిచేయడానికి సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతలు, కానుకలు ఇవ్వలేని దొంగను నేను అని అన్నాడు. 

 

పరిశుద్ధ గ్రంధంలో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక 2:4లో మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను అని చెబుతున్న విధముగా మన యొక్క సమయమున, డబ్బును ఇతరుల కొరకు ఖర్చు చేసినప్పుడు ఏదో ఒక దారిలో ఇతరులకు మనం సేవ చేస్తున్నాం అని అర్థం. మార్కు10:45లో మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను అని మనం చదువుతున్న మనం దేవుని కొరకు సేవ చేయు వారివలె అనేకులను ఆయన మార్గంలో నడిపించే వారి వలె మనలను, మనలో ఉన్న వాటిని ఖర్చు చేయుటకు మనము సిద్ధమా? లేకపోతే మనం దేవునికి సంబంధించిన వాటిని దొగిలిస్తున్నాము అని అర్థం. 

 

ప్రియమైన వారలారా! సమయం బంగారం వంటిది అని అంటారు. పనికిరాని మాటలు మాట్లాడితే మన సమయం దొంగిలించబడుతుంది. టీవీ ద్వారా మన సమయం దొంగిలించబడుతుంది, సెల్ ఫోన్ ద్వారా మన సమయం దొంగిలించబడుతుంది. యోహాను సువార్త 10:10లో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు అని చదువుతున్నాం. ఎవడైనా ఒక దొంగ మన ఇంటికి వచ్చి మన వస్తువులను దొంగిలిస్తే మనం భయ పడతాము, బాధ పడతాము. కాని మనకు తెలియకుండానే మన సమయం దొంగిలించుటను గమనించి జాగ్రత్తగా ఉండాలి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

లోకాన్ని కదిలించే 120 మంది మిషనరీల కొరకు 60 రూములు కట్టి పూర్తి చేయుటకు దేవుడు అవసరతలు సందించేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)