Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 17.08.2022

దిన ధ్యానము(Telugu) 17.08.2022

 

అంశం:- అనాధ పిల్లలు.

 

"తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే" - యాకోబు 1:27

 

టర్కీ కి చెందిన ఒక వాలేంటీర్ అధికారి ప్రచురించిన ఒక ఫోటో అనేక మందికి కంట నీరు పెట్టేలా చేసింది. ఆకలి, పేదరికం, కరువుతో ఉన్న సోమాలియాలో ఈ సంవత్సరం ఒక్క పూట భోజనము కొరకు అక్కడక్కడ తిరుగుటను చూడగలం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషన్ అనే పద్దతిలో కొంత మొత్తం ఆహారమును అందజేస్తుంది. అదే విధంగా అనేక స్వచ్చంద సంస్థలు కూడా సోమాలియాకు సహాయం చేస్తున్నాయి. ఆహారపు పొట్లమును తీసుకొని వచ్చిన ఒక అతని వైపు చూసి రెండు సంవత్సరాల వయస్సు ఉన్న బాలిక ఏడుస్తున్నది. అప్పటికే తాను కరువు కారణముగా తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ బాలిక తాను జీవించుటకు ఒక నమ్మకము కలుగుటను చూసి ఏడుస్తుంది. సోమాలియాలో ఇటువంటి లక్షల మంది అనాధాలు ఉన్నారు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువైన యేసు మత్తయి సువార్తలో చెప్పుటను మనం విన్నాం. పైన చెప్పబడిన సంఘటనలో ఆహారం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకొరకు మాత్రమే కాదు తల్లిదండ్రులను కోల్పోయి ఆధారం లేక అనాధలుగ ఉన్న వారిని మనం ఆధరించాలి. నిస్సహాయతలో ఉన్న పిల్లలను కూడా మనం ఆధరించాలి అని మనం చూస్తున్నాం. ఈ సత్క్రియలను క్రైస్తవులమైన మనం అందరం చెయ్యాలి అని ప్రభువు మన నుండి అధికముగా ఆశిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ ను అక్రమించడం వలన లక్షలాది మంది చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధాలై పోయారు. సోమాలియా వంటి ఆఫ్రికాలో ఉన్న చాలా ప్రాంతాల్లో కరువు ఏర్పడి అనాధాలైన పిల్లలు లెక్కలేనంత మంది. బీదలను కటాక్షించు వాడు ధన్యుడు అని కీర్తనలు గ్రంధంలో మనం చదువుతున్నాం. మనం దేవుని ముందు కలిగి ఉండవలసిన పవిత్రమైన మచ్చలేని పవిత్రమైన భక్తి అంటే ఏమిటో అని పైన చెప్పబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. అనాధ పిల్లలు, పేదవారు, చేయి విడువబడిన వారి మీద మనం శ్రద్ద చూపించాలి అని పరిశుద్ధ గ్రంధం ఆయిన బైబిల్ మనకు బోధిస్తుంది. సమాజంలో అనాధ పిల్లలను మనం చూసినప్పుడు వారి మీద దయ, జాలి కలగాలి దానికి ప్రభువు మనకు సహాయం చేయును గాక! ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.

 

ప్రార్థన అంశం:-

ప్రతి సోమవారం యవ్వన పిల్లల కొరకు ప్రచురిస్తున్న పత్రిక ద్వారా అనేక మంది యవ్వనులు తాకబడేలా ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)