Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 15.08.2022 (Youth Special)

దిన ధ్యానము(Telugu) 15.08.2022 (Youth Special)

 

అంశం:- సంరక్షణ కరమైన స్వాతంత్ర్యం.

 

"నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము" - సామెతలు 6:3

 

వేణి వాళ్ళ నాన్న ఒక కొత్త ఇల్లు కట్టిస్తున్నాడు. అప్పుడప్పుడు కట్టబడుతున్న ఇంటిని చూచుటకు వెళ్తున్న నాన్నతో కలసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేణి కూడా వెళ్ళేది. తాను అలా వెళ్తున్న ప్రతిసారి అక్కడ సామాజికంగా ఉంటున్న ఎదురింటి రాణినే చూస్తూ ఉండేది. కొత్త ఇంటికి వెళ్లిన తరువాత ఇద్దరు స్నేహితులయ్యారు. వేణి ప్రవర్తన మారింది. ఎప్పుడు చూసినా రాణి దగ్గరకు వెళ్లి ఇద్దరు కలిసి షాప్ కు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉండేవారు. ఒక రోజు వేణి తన ఇంటర్ పూర్తిచేసుకుని దగ్గరలో ఉన్న వేరొక కళాశాలకు వెళ్ళ వలసి వచ్చింది. వేణి వాళ్ళ నాన్న ఆ కళాశాలకు తీసుకొని వెళ్తాను అన్నారు కాని వేణి మాత్రం ఏడుస్తూ రాణితో కలిసి వెళ్తూవుంది. మార్గంలో ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో ధీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. అప్పుడు షెకెము అనే యవ్వనుడు ఆమెను చెరిపెను కాబట్టి జరిగినది ఏమిటి ధీనా సహోదరులు షెకెమును తన కుటుంబమును మాత్రమే కాక ఆ ఊరు అంతటిని నాశనం చేసేసారు. ఒక చిన్న తప్పు వలన ఒక ఊరే నాశనం అయిపోయింది. ఇటు వంటి కార్యాలు జరుగుటను ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి వెళ్తున్న యవ్వన పిల్లలు తప్పుడు పనులలో చిక్కుకొనుట మనం చూస్తున్నాం. ఎంతో మంది తమ జీవితమును ఇలా పాడుచేసుకొంటున్నారు. తల్లిదండ్రుల మాటలను త్రోసివేసి వారి సంరక్షణను ద్వేషించే పిల్లలే ఇందులో ఎక్కువ బాదింపబడుతున్నారు. ఇందులో అడపిల్లలది మాత్రమే తప్పు కాదు మగ పిల్లలకు తోటి వారితో ఎలా నడుచుకోవాలి అనేదాన్ని బోధించాలి. షెకెముకు వారి తల్లిదండ్రులు ఇలా బోధించి ఉంటే తప్పు జరిగేది కాదేమో. బదులుగా తన తండ్రి తనకు సహాయం చెయ్యడమే నాశనమునకు ప్రధానకారణం. 

 

ప్రియమైన చెల్లెలారా ఎంత చెప్పినా మన సమాజం మార్పు పొందుటకు సిద్ధంగా లేదు కాబట్టి మనలను మనమే సంరక్షించు కొనుటయే తెలివైన పని. తల్లిదండ్రుల సంరక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు మనమే ప్రమాదం లోనికి త్రోసి వేసుకుంటున్నాం అని అర్థం. మనకు నచ్చినట్లు జీవించుటయే స్వాతంత్ర్యపు జీవితం అనుకొంటున్నాం. అది కాదు కట్టుబాట్లుతో కూడిన స్వాతంత్ర్యమే నిజమైన సంరక్షణకరమైన స్వాతంత్ర్యం. కాబట్టి మోసపూరితమైన ఈ లోకపు కన్నుల నుండి మనలను మనము కాపాడుకొనుటకు మన కన్నవారి యెడల విధేయత చూపి వారికి లోబడి వారు ఇచ్చే సంరక్షణ పొందుకొన్నప్పుడు కచ్చితంగా పరలోకపు దేవదూతలు సంరక్షణ కూడా మనం పొందుకొని పరిశుద్ధంగా జీవించగలం. హల్లెలుయా!

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

టీవీ కార్యక్రమాల ద్వారా అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)