Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 12.08.2022

దిన ధ్యానము(Telugu) 12.08.2022

 

అంశం: అవమానం.

 

"దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను" - ఆదికాండము 3:21

 

రోడ్డు ప్రక్కన మానసిక వ్యాధి గ్రస్తులు సరైన దుస్తులు లేకుండా ఉండుట మనం చూసి ఉంటాం. కొందరు కనికరించి వారికి దుస్తులు ఇచ్చిన సరే వారు వాటిని ధరించరు. వాటిని వేసుకోవాలి అనే ఆలోచన కూడా వారికి రాదు. ఇటువంటి వారి కోసం మనం కన్నీటితో ప్రార్దిద్దాం. ఒక వ్యక్తి యొక్క ఏకరీతి వస్త్రధారణ అనేది అతని యొక్క సరైన మానసిక స్థితిని తెలియ జేస్తుంది. కాబట్టి అవమానం అనేది ఆరోగ్య కరమైన ఒక వ్యక్తి మానసిక స్థితి యొక్క వ్యక్తీకరణ. ఇప్పుడు మన దృష్టిని వేరే వైపునకు త్రిప్పుదాం. టీవీ వారాల్లో కొన్ని కొన్ని సార్లు నేరం లేని ఖైదీలను మనం చూస్తున్నాం. వీరిని కోర్టుకు తీసుకొని వెళ్లినప్పుడు వారి ప్రవర్తన ఆధారంగా వారిని రెండు వర్గాలుగా విభజించ వచ్చు. మొదటి వర్గం టీవీ చూసిన వెంటనే రుమాలుతో లేక చేతులతో వారి మొఖం కప్పుకొంటారు. రెండవ వర్గం కెమెరాను చూసిన వెంటనే ప్రజల కోసం వారు ఏదో సాధించి నట్లుగా నవ్వుతూ చేతులను పైకి ఎత్తి ఆడిస్తూ ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య సముద్రం అంత వ్యత్యాసం కలదు. మొదటి వర్గం వారు చేసిన తప్పును గ్రహించి ఆ తప్పు నిమిత్తం గల అవమానంతో వారి మొఖం కప్పుకొంటారు. అయితే వీరు సరైన మార్గంలో వెళ్లుటకు అవకాశం ఉంది. రెండవ వర్గం వారు చేసిన తప్పు నిమిత్తం అవమానం చెందరు. ఇటువంటి నేరస్తులతో నిండిన సమాజం ఆలోచించ దగినది అని "డెలివిరస్ ఫ్రమ్ ఈవిల్ అనే పుస్తకంలో అచియోన్ వ్రాసారు. ఇంకా ఈనాడు సినిమా టీవీ మాత్రమే కాదు శరీర భాగాలు కనిపించే విధంగా దుస్తులు ధరించడం ఫ్యాషన్ గా పరిగణించ బడుతుంది. కొంచం ఆలోచించి చూస్తే మానసిక స్థితిలో దుస్తులు ధరించే వారికి ఫ్యాన్స్ గురించి దుస్తులు ధరించే వారికి మధ్య తేడా ఏముంది. మన చుట్టూ ఉన్న అవమాన కరమైన సమాజం రక్షణ దుస్తులు ధరించే విధంగా మనం ప్రార్దిద్దాం.

- బ్రదర్. జె.సంతోష్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఉజ్జీవ కూటములలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దేవుని కొరకు ఉజ్జీవముతో లేచి ప్రకాశించేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)